Monday, December 23, 2024

బాబు అరెస్టుపై మేం తటస్థం

- Advertisement -
- Advertisement -

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశం. ఆంధ్రా పంచాయితీ అక్కడే తేల్చుకోవాలి. ఎపి పంచాయితీలకు తెలం గాణను వేదిక కానివ్వం. తెలంగాణ ప్రజల ను తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టడం సరికాదు. చంద్రబాబు అరెస్టుపై మా పార్టీ నేతలు స్పందిస్తే అది వారి వ్యక్తిగత వ్యవహారం. ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ వివాదాలతో తెలంగాణకు సంబంధం లేదు. బాబు అరెస్టు అయింది ఆంధ్రప్రదేశ్‌లో . ర్యాలీలు, ధర్నాలు చేయాలనుకుంటే అక్కడే చేయాలి. ఎవరూ అడ్డుకోరు. అక్కడ చేయకుండా ఇక్కడ రాజకీయ రాద్ధాంతం చేస్తానంటే ఎ లా? తెలంగాణలో ఇవాళ ఒకరు ర్యాలీ చేస్తే.. రేపు మరొకరు చేస్తారు. పక్కింటి పంచాయితీ కూడా ఇక్కడ తేల్చుకుంటారా..? విజయవాడలో, అమరావతిలో, రాజమహేంద్రవరంలో ర్యాలీలు చేయండి. ఇక్కడ మేము ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. శాంతిభద్రతల సమస్య వస్తే ఎలా? చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో మేం తటస్థంగా ఉన్నాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News