Tuesday, January 21, 2025

వైద్యవిద్యలో మనమే నెంబర్‌వన్

- Advertisement -
- Advertisement -

దేశంలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
అత్యధిక ఎంబిబిఎస్ సీట్లు ఇక్కడే
ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబిబిఎస్ సీట్లున్న రాష్ట్రం మనదే

9 మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం
జరిగే15వ తేదీన వైద్య విద్య
విజయోత్సవం నిర్వహించాలి
టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పా టు చేస్తున్నది. అందులో భాగగంగా ఈనెల 15న తొమ్మి ది ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏకకాలంలో ప్రారంభించి చరిత్ర సృష్టించనున్నది. జిల్లాకు ఒక మెడికల్ కాలేజిని ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి ఏకైక రాష్ట్రంగా తె లంగాణ నిలువనున్నది. ఇప్పటికే ఆయా జిల్లాల్లో ప్రభు త్వ మెడికల్ కాలేజీలు ప్రారంభం కాగా, తాజాగా మరో 9 జిల్లాల్లో 9 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చా యి. ఈ నెల 15వ తేదీన ముఖ్యమంత్రి కెసిఆర్ ఏకకాలంలో 9 మెడికల్ కాలేజీల తరగతులను ప్రారంభించనున్నారు.

ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీలు ప్రారంభం కా నున్న కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూ పాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాల మంత్రులు, ఎంఎల్‌ఎలతో మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావులు శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, తెలంగాణ ఆహార ఉత్పత్తిలోనే కాదు దేశ ఆరోగ్యానికి కీలకమైన డాక్టర్ల ఉత్పత్తిలోనూ అగ్ర స్థానంలో ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని జనగా మ, నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, అసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, ఖమ్మం జిల్లాల్లో నూతన మెడికల్ కాలేజీలను ఈనెల 15వ తేదీన ప్రారంభించుకోబోతున్నామని, మెడికల్ కాలేజీలు ప్రారంభించుకుంటున్న 9 జిల్లా కేంద్రాల్లో కనీసం 15 నుంచి 20 వేల మందికి తగ్గకుండా భారీ ర్యాలీలను చేపట్టాలని తెలిపారు. స్వయం గా ముఖ్యమంత్రి ఒక మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం లో పాల్గొనే అవకాశం ఉందని,దీంతో పాటు ఆరోగ్య శా ఖ మంత్రి హరీష్ రావు కామారెడ్డిలో పాల్గొననున్నారని పేర్కొన్నారు. ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు ద్వారా ఆ జిల్లా పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల ప్రజలకు, జి ల్లా ప్రజలకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు. కాబట్టి ఆయా జిల్లాల పరిధిలో ఉన్న శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు ఈ నెల 15న జరిగే కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.

మెడికల్ కాలేజీ ప్రారంభం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజల్లో రిజిస్టర్ అయ్యే విధంగా ఈ కార్యక్రమంలో భారీగా పెద్ద ఎత్తున యువతను, విద్యార్థులను భాగస్వాములను చే యాలని అన్నారు. మెడికల్ కాలేజీ ఏర్పాటు వలన కేవ లం విద్యార్థులకే కాకుండా దానికి అనుబంధంగా ఉండే హాస్పిటల్ వలన ప్రజలకు అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందుతాయని చెప్పారు. మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో కాంగ్రెస్, బిజెపిల వైఫల్యాన్ని ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. రెండు జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ మెడికల్ కాలేజీల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం చేసిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలిపారు. జాతీయ పార్టీల మోసాన్ని ప్రజల్లోకి తీ సుకెళ్లాలని సూచించారు. రెండు జాతీయ పార్టీలు మో సం చేసినా.. సిఎం కెసిఆర్ మార్గనిర్దేశనంలో దేశంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని పేర్కొన్నారు.

దేశంలో అత్యధిక ఎంబిబిఎస్ సీట్లు ఉన్న రాష్ట్రం తెలంగాణ : హరీశ్‌రావు
దేశంలో అత్యధిక ఎంబీబీఎస్ సీట్లు ఉన్న రాష్ట్రం.. తెలంగాణ మాత్రమే అని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబిబిఎస్ సీట్లు ఉన్నాయని తెలిపారు. 2014లో చివరి స్థానంలో ఉన్న రాష్ట్రం.. నేడు అగ్రస్థానంలోకి చేరిందన్నారు. ఈ ఏడాది పెరిగిన ఎంబిబిఎస్ సీట్లలో 43 శాతం రాష్ట్రంలోనే పెరిగాయని పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని చెప్పారు. 50 సంవత్సరాలకుపైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం తెలంగాణ ఉద్యమ ఒత్తిడి వల్ల నిజామాబాద్, ఆదిలాబాద్‌లో మాత్రమే మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు తెంలగాణలో ఐదు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని, ఈ ఏడాదితో ఆ సంఖ్య 26కు పెరిగిందన్నారు. ఇదివరకు తెలంగాణ విద్యార్థులు వైద్య విద్య కోసం పక్క రాష్ట్రాల నుంచి మొదలుకొని ఉక్రెయిన్, రష్యా వంటి విదేశాలకు వెళ్లి అనేక కష్టాలు పడి చదువుకునేవారని, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ పిల్లలు స్వరాష్ట్రంలోనే ఎలాంటి కష్టం లేకుండా వైద్య విద్యను అభ్యసించే గొప్ప సౌకర్యాన్ని కల్పించారని తెలిపారు. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో అందుబాటులోకి వచ్చిన నూతన వైద్య సౌకర్యాలను ప్రజలకి వివరించాలని ఆయా జిల్లాల మంత్రులు, ఎంఎల్‌ఎలకు మంత్రి హరీశ్‌రావు సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News