Sunday, January 19, 2025

రైతుల పక్షాన మేమున్నాం…

- Advertisement -
- Advertisement -
  • మంత్రి సబితా ఇంద్రారెడ్డి
  • రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై టిఆర్‌ఎస్ నిరసన
  • కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రంగానికి 24 గంటలపై వ్యతిరేకత
  • బిజెపిది బావుల వద్ద మీటర్లు, ఫ్యాన్లు

కందుకూరు: రైతుల ప్రక్షాన నిలబడి అనేక సంక్షేమ పథకాలతో అండగా ఉన్నది కేవలం బిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఇటివల పిసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులకు 24 గంటల విద్యుత్ అవసరం లేదని కేవలం మూడు గంటలు చాలనే వ్యాఖ్యలపై మండిపడుతూ కందుకూరు మండల కేంద్రంలోని శ్రీశైలం హైద్రాబాద్ జాతీయ రహదారిపై నియోజకవర్గ మహా దర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నిరసన తెలిపారు.

మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆద్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనితాహరినాథ్‌రెడ్డి, గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని రేవంత్ వ్యాఖ్యలపై తమదైన శైలిలో ఘాటుగా విమర్శించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రైతు సంక్షేమ పథకాలతో దేశానికి ఆదర్శంగా నిలస్తున్న రాష్ట్రంలో కేవలం రాజకీయ ప్రయోజనాల కోరకు రైతులను పావులుగా వాడుకోకూడదన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధించుకున్న అనంతరం బంగారు తెలంగాణ సాధన కోరకు నిరంతరం కృషిచేస్తున్న కేసిఆర్ సేవలు మరీంత అవసరం అన్నారు.

రైతుల శ్రేయస్సే ధ్యేయంగా రైతు బందు, రైతు భీమా, ఉచిత విద్యుత్, మీషన్ కాకతీయ, కళ్యాణలక్ష్మి వంటి పథకాలు పార్టీలతో సంబందం లేకుండా అర్హులైన ప్రతిఒక్కరికి వర్తించేలా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. రైతులకు సూచనలు సలహాలు ఇవ్వడానికి రైతు వేదికలు ఏర్పాటు చేసి అధికారులను ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేకుండా రైతులకు ఒకే చోట ఏర్పాటు పంటల అవగాహాన కల్పించడం , మార్కెట్ కు అనువైన పంటల వివరాలను రైతులకు వివరిస్తూ సేవలు చేస్తున్నారన్నారు.

నకిలీ విత్తనాల సమస్యలేకుండా ప్రభుత్వం కట్టుబడి ఉండి నకిలి విత్తనాల సరఫరా చేసిన ఏ ఒక్కరికి విడువకుండా పిడి యాక్ట్ కేసులతో నేడు మంచి దిగుబడులతో రైతులు తమ కళల సాగును సాగిస్తున్నారన్నారు. బిజెపి,కాంగ్రెస్ పార్టీలు రైతులను మరల అందకారంలోకి పడేయడానికి 3 గంటల విద్యుత్ చాలని, మోటార్లకు మీటర్లు పెట్టాలని కక్షసాధింపుచర్యలకు దిగుతున్నారని రైతులు జాగ్రత్తపడాల్సిన అవసరం ఉందని సూచించారు.

ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ కందుకూరు , మహేశ్వరం మండలాద్యక్షుడులు మన్నె జయేందర్ ముదిరాజ్, రాజు నాయక్ జడ్పిటిసి బొక్క జంగారెడ్డి, మహేశ్వరం ఎంపిపి రఘుమారెడ్డి, వైస్ ఎంపిపి సునిత ఆంద్యానాయక్, మహేశ్వరం మార్కెట్ కమిటి చైర్మన్ సురసాని సురేందర్ రెడ్డి,పిఎసిఎస్ చైర్మన్ చంద్రశేఖర్, కర్రోళ్ల చంద్రయ్య ముదిరాజ్, కందుకూరు, మహేశ్వరం మండలాల సర్పంచులు, ఎంపిటిసిలు, తుక్కుగూడ, బడంగ్‌పేట్, బాలాపూర్, మీర్‌పేట్ బిఆర్‌ఎస్ నాయకులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News