Monday, December 23, 2024

మేము అంటరానివాళ్లమా: “ఇండియా”పై ఎంఐఎం ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

ముంబై: రెండు రోజుల పాటు 26 ప్రతిపక్ష పార్టీలు బెంగళూరులో నిర్వహించిన సమావేశాలకు తమను ఆహ్వానించకపోవడంపై ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తేహాదుల్ ముస్లిమీన్(ఎఐఎంఐఎం) నాయకుడు వారిస్ పఠాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను రాజకీయ అస్పృశ్యులుగా లౌకికవాద పార్టీలమని చెప్పుకునే ఆ ప్రతిపక్ష పార్టీలు పరిగణిస్తున్నాయని ఆయన విమర్శించారు. హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ సారథ్యంలోని ఎఐఎంఐఎం పార్టీని ఎవరైనా ఎలా విస్మరిస్తారని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అయిన వారిస్ పఠాన్ ప్రశ్నించారు.

బుధవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ బెంగళూరులో జిరగిన సమావేశాలకు తమను రాజకీయసస్పృథ్యులుగా లౌఇకికవాదులమని చెప్పుకుంటున్న ఆ పార్టీలు ఆహ్వానించలేదని చెప్పారు. ఒకప్పుడు బిజెపితో అంటకాగిన నితీష్ కుమార్, ఉద్ధవ్ థాక్రే, మెహబూబా ముఫ్తి వంటి నాయకులు ఆ కూటమిలో ఇప్పుడు ఉన్నారని ఆయన చెప్పారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు గుప్పించిన అరవింద్ కేజ్రవీవాల్ బెంగలూరు సమావేశంలో కనిపించారని ఆయన తెలిపారు. 2024 ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని తాము కూడా తీవ్రంగా కృషి చేస్తున్నామని, కాని ఆ పార్టీలు(ప్రతిపక్ష కూటమి) ఎంఐఎంను, ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీని పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News