Thursday, January 23, 2025

ప్రజా అవసరాలకు అనుగుణంగా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం

- Advertisement -
- Advertisement -

కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని జెసింట గార్డెన్స్‌లో మిషన్ భగీరథ పథకంలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి సౌకర్యాన్ని శుక్రవారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా అవసరాలకు అనుగుణంగా మె రుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నామని అన్నారు. కొత్తగా ఏర్పాటైన కాలనీలు, బస్తీల్లో సైతం ప్రజా అవసరాలు తెలుసుకొని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని పే ర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీఎం శ్రీధర్ రెడ్డి, డిజిఎం అప్పల నాయుడు, మేనేజర్ రోహిణి మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News