Monday, December 23, 2024

75 ఏండ్ల కింద మనం రాచరిక పాలనలో ఉన్నాం: మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

We are under monarchy for 75 years: Minister Harish

సిద్ధిపేట : సిద్దిపేట హైస్కూల్ గ్రౌండ్ లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, పోలీస్ కమిషనర్ శ్వేత, మున్సిపల్ చైర్మన్ మంజుల, ప్రముఖ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… 75 ఏండ్ల కింద మనం రాచరిక పాలనలో ఉన్నామన్నారు. దేశానికి 1947లో గాంధీజీ నేతృత్వంలో స్వతంత్రం వచ్చింది. ఎంతో మంది ఆనాటి త్యాగధనుల పోరాటమే రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య దేశంలో మనం అడుగుపెట్టినమని మంత్రి పేర్కొన్నారు. 1969లో తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం జరిగింది. ఎప్పటి కప్పుడు రాచరిక, పెత్తందార్ల పెత్తనాన్ని ఈ గడ్డ తిప్పి కొట్టిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. యావత్ తెలంగాణ ప్రజానీకం సకల జనుల సమ్మెతో ఢిల్లీని గడగడలాడించి తెలంగాణ సాధించామన్నారు. ఈ మధ్య కొన్ని శక్తులు కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తున్నాయని తెలిపారు.

మతాల పేరిట విద్వేషాలు రెచ్చగొట్టే వారికి అధికారం పోతే అభివృద్ధి కుంటు పడుతుందని సూచించారు. తెలంగాణ తలసరి ఆదాయం 80 శాతం. సంపద పెంచు పేదలకు పంచు అనేదే సీఎం కేసీఆర్ నినాదమన్నారు. నవ తెలంగాణ నిర్మాణం కోసం మనం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దేశం మొత్తం తెలంగాణను చూసి నేర్చుకుంటున్నది. రాష్ట్రంలో 173 రెసిడెన్షియల్ స్కూల్ లో 4.50 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని వెల్లడించారు. సిద్దిపేటలో ఎల్ఎల్ బి కోర్స్, బీ ఫార్మసీ కోర్స్ వచ్చే ఏడాది నుండి ప్రారంభమవుతాయని తెలిపారు. సరస్వతి నిలయంగా సిద్దిపేటను తీర్చిదిద్దామన్నారు. సమైక్య రాష్ట్రంలో అన్నింటా తెలంగాణకు వివక్ష జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరం పారలేదని హైదరాబాద్, ఢిల్లీ కేంద్రంగా మాట్లాడే కొంత మంది నాయకులను చూస్తే జాలి వేస్తున్నదని మంత్రి మండిపడ్డారు. ఒక్కప్పుడు పొట్టకూటి కోసం దుబాయ్ పోయి బ్రతికితే ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు కూలీ కోసం వలస వస్తున్నారని మంత్రి చెప్పారు. అంబలి కేంద్రాల తెలంగాణ నుండి 8 ఎండ్లలో దక్షిణ భారత ధాన్యగారంగా తెలంగాణను మార్చుకున్నామని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News