Monday, December 23, 2024

దేశ భవిష్యత్తు కోసం ఐక్యంగా ఉన్నాం: హారిస్

- Advertisement -
- Advertisement -

చికాగో: దేశ భవిష్యత్తు కోసం భాగస్వామ్య దృష్టితో అమెరికన్లు అంతా ఐక్యంగా ఉన్నారని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఇక్కడ డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ ప్రారంభం రోజున భావోద్వేగంతో వెల్లడించారు. ఈ రాత్రి అందరి లోనూ మనదేశం అందాన్ని చూస్తున్నానని, దేశం లోని ప్రతి మూల నుంచి, జీవితం లోని ప్రతిరంగం నుంచి ప్రజలు దేశ భవిష్యత్తు కోసం భాగస్వామ్య దృష్టితో ఏకమయ్యారని 59 ఏళ్ల హారిస్ వేలాది మంది డెమొక్రటిక్ పార్టీ సభ్యుల హర్షధ్వానాల మధ్య అన్నారు.

ఈ నవంబర్‌లో మనం ఒకే తాటిపైకి వచ్చి ఒకే స్వరం, ఒకే వ్యక్తిగా ప్రకటిస్తాం.దేశం పట్ల మనకున్న ప్రేమ ద్వారా, మార్గనిర్దేశం చేస్తూ ఆశావాదం, విశ్వాసంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్షఅభ్యర్థిగా తన అంగీకార ప్రసంగాన్ని హారిస్ గురువారం వెల్లడించాల్సి ఉంది. మాజీ అధ్యక్షుడు ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఆమెకు ప్రత్యర్థి.

ఈ సందర్భంగా మన వైదొలగనున్న అధ్యక్షుడు జో బిడెన్ ను అభినందించుకుందాం అని పేర్కొంటూ.. “మీ చారిత్రక నాయకత్వానికి, దేశానికి జీవితకాలం చేసిన సేవలకు ధన్యవాదాలు అని బిడెన్‌ను ప్రశంసించారు. జాతి వర్ణపు మొదటి మహిళగా హారిస్ అమెరికా లోని ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థి అయ్యారు. అధ్యక్ష టికెట్‌పై అగ్రస్థానంలో ఉన్న మొట్టమొదటి భారతీయ అమెరికన్ కూడా అయ్యారు. త్వరలో మాజీ అధ్యక్షుడు ఒబామా నుంచి ఆమోదాన్ని పొందుతారు. అమెరికాను ముందుకు నడిపించే వ్యక్తిత్వం, అనుభవం, భవిష్యత్ దృక్పథం హారిస్‌కు ఉన్నాయని మాజీ విదేశాంగ కార్యదర్శి, ప్రథమ మహిళ హిల్లరీ క్లింటన్ ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News