‘ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇప్పటికే ఐదు విడతల పోలింగ్ లో ఎన్ డిఏ 300 సీట్లను దాటిందని నేను చెప్పగలను’, కాంతి లోక్ సభ నియోజకవర్గం ఎన్నికల ర్యాలీలో వెల్లడించిన అమిత్ షా.
కోల్ కతా: బిజెపి నేతృత్వంలోని ఎన్ డిఏ ఇప్పటికే 310 మార్కును ఐదు విడతల పోలింగ్ లో దాటేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. కాంతి లోక్ సభ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లడుతూ ‘‘ఎన్డిఏ పొజిషన్ ఏమిటో మీకు తెలుసుకోవాలనుందా? 310 పార్ అయింది’’ అని ఆయన చెప్పుకొచ్చారు.
రాహుల్ గాంధీని విమర్శిస్తూ పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి ఆయన మనం భయపడేలా మాట్లాడుతున్నారు. పాకిస్థాన్ వద్ద అణు బాంబులున్నాయి జాగ్రత్త అంటూ బూచీ చూపుతున్నారు. మేము అణు బాంబులకు భయపడబోమని రాహుల్ కు చెబుతున్నాను. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్ అంతర్భాగం అన్న విషయాన్ని ఏ శక్తి ఆపలేదు’’ అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓడిపోతానేమో అన్నభయంతో రాష్ట్ర పోలీసు బలగాలని దుర్వినియోగం చేస్తోందని అమిత్ షా ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ అక్రమ చొరబాట్లను దేశంలోకి ప్రోత్సాహిస్తూ మరోవైపు పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తోందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం జాతీయ భద్రతన పణంగా పెట్టొద్దని అమిత్ షా , మమతా బెనర్జీని కోరారు.