Monday, December 23, 2024

‘మేము పాలనలను మార్చలేము’: ఒవైసీ

- Advertisement -
- Advertisement -
Asaduddin Owaisi
ముస్లిం ఓటు బ్యాంకు, జ్ఞాన్‌వాపి మసీదు వివాదంపై ఒవైసీ వ్యాఖ్యలు

హైదరాబాద్: ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాద్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ శనివారం మాట్లాడుతూ భారతదేశానికి ఎప్పుడూ ముస్లిం ఓటుబ్యాంకు కాదని మరియు ఎన్నటికీ ఉండరని, దేశంలోని ముస్లిం సమాజం ఎప్పటికీ పాలనను మార్చలేదని అన్నారని  ఎఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు సర్వేకు వారణాసి కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాశీ విశ్వనాథ దేవాలయం పక్కనే ఉన్న మసీదులో అధికారులు కోర్టు ఆదేశాల మేరకు సర్వే ప్రారంభించారు.

“ముస్లింలు దేశంలో పాలనను మార్చలేరు. మీరు తప్పుదారి పట్టించారు. ముస్లింలు ఎప్పుడూ తమను ఓటు బ్యాంకుగానే భావించేవారు. కానీ ఇది నిజం కాదు, ఈ దేశంలో ముస్లింలు ఎప్పుడూ ఓటు బ్యాంకు కాదు, కాబోరు” అని ఒవైసీ అన్నారు.

“భారతదేశంలో, మెజారిటీ ఓటు బ్యాంకు ఉంది, ఉంటుంది. మనం ఒక పాలనను మార్చగలిగితే, పార్లమెంటులో ముస్లింల ప్రాతినిధ్యం ఎందుకు తక్కువగా ఉంది? మనం ప్రభుత్వాన్ని మార్చగలిగితే.. బాబ్రీ మసీదుపై కోర్టు ఉత్తర్వు, ఇప్పుడు జ్ఞాన్‌వాపీ మసీదు సమస్య తెరపైకి ఎలా రాగలిగింది”అన్నారు.  కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ,  బహుజన్ సమాజ్ పార్టీలు ముస్లింలకు ద్రోహం చేస్తున్నాయని ఒవైసీ ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News