Tuesday, January 21, 2025

పోడుకు పట్టం కట్టి గిరిజనులను రాజులను చేశాం

- Advertisement -
- Advertisement -
  • ఎస్టీలకు 10శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత కెసిఆర్‌ది
  • తెలంగాణలో అభివృద్ధి సినీ నటుడు రజనీకి అర్థమైంది… రాష్ట్రంలోని కొంతమంది గజినీలకు అర్థం కావడం లేదు
  • 1127 మందికి పోడుపట్టాల పంపిణీ చేసిన మంత్రి హరీశ్‌రావు

జహీరాబాద్: పోడుకు పట్టం కట్టి గిరిజనులను రాజులను చేసిన ఘనత సిఎం కెసిఆర్‌దేనని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం జహీరాబాద్- పస్తాపూర్ వద్దగల ఎస్‌వి కన్వెన్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆందోలు, జహీరాబాద్ నియోజకవర్గాలకు చెందిన 1127 మంది గి రిజనులు సాగు చేసుకుంటున్న 1808.07 ఎకరాలకు సంబంధించి పోడు పట్టాలను మంత్రి అందజేశారు. ఝరాసంఘం మండలంలో 7 గురికి 19 ఎకరాలు, జహీరాబాద్ మండలంలో 213 మందికి 123.57 ఎకరాలు, కోహీర్ మండలంలో 168 మందికి 218.57 ఎకరాలు, మొగుడంపల్లి మండలంలోని 593 మందికి 1392.52 ఎకరాలు, వట్‌పల్లి మండలంలోని 145 మందికి 53.16 ఎకరాలు, చౌటకూర్ మండలంలోని ఒక లబ్ధిదారునికి 1.25 ఎకరాలకు సంబందించిన పట్టాలు లబ్ధిదారులకు ఇచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజనులను రైతులుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రిదేనన్నారు. పోడు భూముల ద్వారా పట్టాలు ఇవ్వడమే కాకుండా ప ది రకాల ప్రయోజనాలు గిరిజనులకు దక్కుతున్నాయని మంత్రి తెలిపారు. భూమి పట్టాతోపాటు యజమాన్య హక్కు, రైతుబంధు, రైతుబీమా, వారసత్వం హక్కు, ఉచిత విద్యుత్, సబ్సీడిపై పనిముట్లు, పంట నష్టం, గిరిజనులపై పెట్టిన కేసుల రద్దు, పంట రుణాలు, సొసైటీల్లో అధికారు లు పోడు రైతులకు అందనున్నట్లు మంత్రి వివరించారు. గత ప్రభుత్వాలు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఏనాడు ఆలోచించలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్య, ఉద్యోగాల్లో గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ కల్పించారని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సిఎం కెసిఆర్ రాష్ట్రంలో 3146 తండాలను గ్రామపంచాయతీలుగా చేశారని అన్నారు. మా తండాలో మా రాజ్యం అన్న గిరిజనుల కలను నిజం చేశారన్నారు.

95 గిరిజన గురుకులాలను ఏర్పాటు చేశామని, సేవాలాల్ జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ గిరిజనుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిందన్నారు. బిఆర్‌ఎస్ గిరిజనుల కోసం ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తుందన్నారు. ప్రజల బా ధలను తీర్చిన ఘనత కెసిఆర్‌దని, కెసిఆర్‌కు తెలంగాణ ప్రజలకు ఆత్మబంధం, పేగుబంధం ఉంటుందన్నారు. ప్రముఖ సినీ నటుడు రజనీకి తెలంగాణ జరిగిన అభివృద్ధి అర్థమైంది కానీ రాష్ట్రంలో ఉన్న కొంతమంది గజనీలకు అర్థం అవడం లేదని, కనిపిస్థలేదని ఎద్దెవ చేశారు. ఎంపి బిబి పాటిల్ మాట్లాడుతూ ఎన్నో యేళ్లుగా పోరాటం చే స్తూ, కష్టపడ్డ పోడు భూముల లబ్ధిదారులకు పోడుపట్టాలను తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ప్రజల బాధలను తీర్చుతున్న ప్రభుత్వాన్ని మరోసారి దీవించాలని కో రారు. ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మాట్లాడు తూ భూములు సాగు చేస్తున్న హక్కులు లేక బాధపడ్డ పో డు లబ్ధిదారులకు భూమి మీద హక్కు కల్పించిన ఘనత సిఎందని ఎవరు చేయని పని సిఎం చేశారని అన్నారు.

జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు మాట్లాడుతూ… గిరిజనుల ఎన్నోల యేళ్ల పోరాట ఫలితం తెలంగాణ ప్రభుత్వంతో తీరిందన్నారు. పోడు భూములు పొందిన లబ్ధిదారులందరికి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ గిరిజనులకు పోడు భూముల పట్టాలు అందించి ధైర్యంగా వ్యవసాయం చేసుకునే అవకాశం తెలంగాణ కల్పించిందన్నారు. తరతరాలుగా భూమి సే ద్యం చేసుకుంటున్న వారికి అటవీ హక్కుల చట్టం కింద జిల్లాలో 1127 మందికి పోడు పట్టాలను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముందు జ్యోతి ప్రజ్వలన చేసి సేవాలాల్ మహారాజ్ అమ్మవారి చిత్రపటాలకు పుష్పాలంకరణ చేసి పూజలు నిర్వహించారు. గిరిజన లబ్ధిదారులు అనంతరం సిఎం కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశా రు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పి రమణకుమార్, అదన పు కలెక్టర్ వీరారెడ్డి, రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చిం తా ప్రభాకర్, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్, రాష్ట్ర ఆర్థిక సంఘం అధ్యక్షుడు వి. భూపాల్‌రెడ్డి, రాష్ట్ర పరిశ్రమల అ భివృద్ధి సంస్థ చైర్మన్ తన్వీర్, డిసిసిబి వైస్ చైర్మన్ మా ణిక్యం, జిల్లా అధికారులు, గిరిజన సంక్షేమ అధికారి ఫిర ంగి, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News