- Advertisement -
హైదరాబాద్: రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అట్టహాసంగా తెలంగాణ జాతీయ సమైఖ్యత వజ్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. పీపుల్స్ ప్లాజాలో వజ్రోత్సవాల్లో మంత్రులు తలసాని, మహమూద్ అలీ, సి.ఎస్ సోమేశ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర హోమ్ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ… ‘సెప్టెంబర్ 17 చాలా ముఖ్యమైన రోజు. అంతకు ముందు నిజాం ప్రభుత్వం ఉండేది. మిగతా ప్రాంతాల్లోగా మనకు అంత సులభంగా స్వాతంత్య్రం రాలేదు. పెద్ద ఉద్యమం… చాలామంది ప్రాణాలు కోల్పోయాక మనకు స్వాతంత్య్రం వచ్చింది. నిజాం మంచి రాజు… భారత దేశంలో హైదరాబాద్ విలీనం కావాలని నెహ్రూకు లేఖ రాశారు. ఖాసీం రజ్వీ లాంటి వాళ్ళు వ్యతిరేకించినా ఆయనను జైల్లో పెట్టి స్వాతంత్య్రం ఇచ్చారు. దేశానికి గాంధీ ఎలాగో… తెలంగాణకు గాంధీ కేసీఆర్. దేశానికి తెలంగాణ మోడల్ దేశానికే ఆదర్శం’ అని మహమూద్ అలీ పేర్కొన్నారు.
- Advertisement -