Wednesday, March 12, 2025

మోహన్‌బాబు-సౌందర్య గొడవ : క్లారిటీ ఇచ్చిన సౌందర్య భర్త

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రముఖ సినీ నటి సౌందర్యకి, సీనియర్ నటుడు మోహన్‌బాబుకి మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయని సోషల్‌మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన సౌందర్య మరణానికి కూడా మోహన్‌బాబే కారణం అంటూ సామాజిక కార్యకర్త ఎదురుగట్ల చిట్టిమల్లు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈ వార్తలపై సౌందర్య భర్త రఘు స్పందించారు తమకు మోహన్‌బాబుతో ఎలాంటి తగదాలు లేవని ఆయన స్సష్టం చేశారు.

ఈ మేరకు ఆయన ఓ బహిరంగా లేఖను విడుదల చేశారు. ‘సౌందర్య ఆస్తిని మోహన్‌బాబు ఆక్రమించుకున్నారని వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాను. మోహన్‌బాబుతో సౌందర్య ఎలాంటి భూ లావాదేవీలు చేయలేదు. మంచు కుటుంబంతో గత 25 సంవత్సరాలుగా మంచి అనుబంధం ఉంది. మోహన్ బాబును మేం చాలా గౌరవిస్తాం. మేం ఓ కుటుంబంలా కలసి ఉంటాం. మోహన్ బాబుతో మాకు ఎలాంటి ఆస్తి తగదాలు కానీ, ఇతర లావాదేవీలు కానీ లేవు’ అని రఘు లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News