Monday, December 23, 2024

కెసిఆర్ పాలనలో మహిళకు నవశకం

- Advertisement -
- Advertisement -

We encouraging women entrepreneurs:KTR

ఆడపిల్లలందరికీ మేనమామ సిఎం, అప్పుడే పుట్టిన బిడ్డలకోసం
11లక్షల కిట్లను పంపిణీ చేశాం, దేశంలో ఎక్కడాలేనివిధంగా
మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సాహిస్తున్నాం :

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పటాన్‌చెరువు సభలో మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/పటాన్‌చెరు : సిఎం కెసిఆర్ పాలనలో మహిళలకు నవశకం అని, ఆడ పిల్లలకు మేనమామగా సిఎం నిలుస్తున్నారని మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఆంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు జిఎంఆర్ ఫంక్షన్ హాలులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుల్తాన్‌పూర్‌లో 50 ఎకరాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహిళా పారిశ్రామిక పార్క్‌ను కెటిఆర్ ప్రారంభించి, పైలాన్‌ను ఆవిష్కరించారు. మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా మహిళా పారిశ్రామికవేత్తలను తెలంగాణలో ప్రోత్సహిస్తూ.. వారికోసం కోసం వీ హబ్ ఏర్పాటు చేశామన్నారు. మహిళా సాధికారిక కోసం కెసిఆర్ నాయకత్వంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని, రాష్ట్రంలోని పారిశ్రామిక పార్కుల్లో మహిళా పారిశ్రామికవేత్తలకు 10శాతం పెట్టుబడి రాయితీ ఇస్తూ.. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు కెసిఆర్ సహకారం అందిస్తున్నారన్నారు. ఆడ పిల్లలందరికి ముఖ్యమంత్రి కెసిఆర్ మేనమామగా వ్యవహరిస్తున్నాడన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డల కోసం ఇప్పటి వరకు 11లక్షల కిట్లను అందజేశారన్నారన్నారు.

పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచడం జరిగిందన్నారు. పటాన్‌చెరు నియోజకవర్గ స్వయం సహాయక సంఘాల మహిళలకు రు.42.55 కోట్లు, శ్రీనిధి రుణాల కింద రూ.105.65 కోట్ల బ్యాంకు లింకేజి సర్టిఫికెట్లను అందజేశామన్నారు. టిఆర్‌ఎస్ ప్రభత్వం వచ్చిన తర్వాత శిశు మరణాలు తగ్గాయని, గురుకుల పాఠశాల్లో చదివే విద్యార్థులొక్కరి కోసం సుమారు రూ.1.2 లక్షలు ఖర్చు పెడుతున్నామన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇందుకోసం రూ.7,300 కోడ్లు ఖర్చు చేస్తున్నట్టుగా పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మారనున్నాయని మంత్రి కెటిఆర్ హామీ ఇచ్చారు. మహిళ స్వేచ్ఛగా తిరగాడటం కోసం షి టీంల ఏర్పాటుతో మహిళల్లో ఆత్మవిశ్వాస ం పెరిగిందన్నారు.

మహిళ అభ్యున్నతి దృష్యా మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని.. దాని కోసం బడ్జెట్‌లో రూ.100 కోట్ల కేటాయించినట్టుగా తెలిపారు. రాష్ట్రంలో జిల్లాకో మెడికల్ కాలేజి ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. పారిశ్రామికవాడగా గుర్తింపు ఉన్న పటాన్‌చెరులో 350 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు నిధులు కేటాయించినట్టుగా తెలిపారు. గత 75 సంవత్సరాలుగా జరుగని అభివృద్ధ్ది 7 సంవత్సరాల్లో జరిగిందన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారాక్ ద్వారా రూ.9వేల కోట్లు అందించిన ఘనత కెసిఆర్‌కే దక్కిందన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, కలెక్టర్ హన్మంత రావు, జడ్పిటిసిలు, ఎంపిపిలు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News