- Advertisement -
చిత్తూరు: తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో మరో 5 చిరుతలు సంచరిస్తున్నట్లు గుర్తించామని టిటిడి ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. తిరుమల ఏడో మైలు, నామాలగని, లక్ష్మీనరసింహాస్వామి ఆలయం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుతలు సంచరిస్తున్న దృశ్యాలు రికార్డైనట్లు తెలిపారు. భక్తుల భద్రత దృష్ట్యా ఐదు చిరుతలను పట్టుకునేందుకు ఆపరేషన్ కొనసాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కాగా, నడకదారిలో చిన్నారిపై దాడి చేసి చంపిన నేపథ్యంలో చిరుతల నుంచి భక్తులకు భద్రత కల్పించేందుకు అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఈరోజు(సోమవారం) మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల అన్నమయ్య భవన్ లో అటవీశాఖ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు, చిరుతల సంచారంతో కాలినడక మార్గంలో వెళ్లేందుకు భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.
- Advertisement -