Monday, December 23, 2024

దశాబ్ద కాలంలో శతాబ్ది అభివృద్ధి సాధించాం

- Advertisement -
- Advertisement -
  •  రాష్ట్ర అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక కొంత మంది విషం చిమ్ముతున్నారు
  •  తెలంగాణ ఏర్పడితే చీకటిగా మారుతుందన్న మాజీ సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి
  •  చీకటి మనకు కాదు… చీకటిలో పడ్డ కిరణ్ కిరణ్‌కుమార్‌రెడ్డి
  • స్వరాష్ట్రంలో పేదలలో ఆత్మ గౌరవం పెరిగింది
  •  కులవృత్తుల వారికి లక్ష రూపాయల రుణం
  • రాష్ట్ర సర్కార్ చేసిన పనులను ప్రతి గడపగడపకు వివరించాలి
  •  దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించుకుందాం
  • రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

సిద్దిపేట: సిఎం కెసిఆర్ పాలనలో దశాబ్ద కాలంలో శతాబ్ది అభివృద్ధి సాధించుకున్నామని రాష్ట్ర ఆర్థిక,  వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రమైన విపంచి ఆడిటోరియంలో నియోజక వర్గస్థ్ధాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను సిద్దిపేట నియోజకవర్గంలో వైభవంగా నిర్వహించి రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలన్నారు. తెలంగాణ ఏర్పడితే మాజీ సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చీకటిగా మారుతుందన్నారు. చీకటి మనకు కాదు… చీకటిలో పడ్డ కిరణ్ కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

ఆధ్యాత్మికం, పర్యాటకం ఇలా ఏ రంగంలో నైనా సిఎం కెసిఆర్ నాయకత్వంలో గుణాత్మక మార్పు సాధించామన్నారు. 21 రోజుల ఈ దశాబ్ది ఉత్సవాల పండుగలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ నాడు నేడు సిఎం కెసిఆర్ హయాంలో జరిగిన అభివృద్ధ్ది వివరించాలన్నారు. ప్రభుత్వం పదేళ్లలో చేసిన పనిని ఉద్దేశ్యాన్ని క్షేత్రస్థ్ధాయిలో ప్రజలకు వివరించాలన్నారు. ఈ దశాబ్ది ఉత్సవ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ హాజరు కావాలని నిర్లక్షంగా ఉండొద్దున్నారు. స్థ్ధానిక గ్రామ ప్రజాప్రతినిధులు గుర్తించి సహకారాన్ని అందించాలన్నారు. సమష్టిగా అందరూ కలిసి ముందుకు సాగుదామన్నారు. గత ఉమ్మడి రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల పదవి కాలంలో విద్యుత్ సమస్యలపై ఖర్చులు చేశారే తప్ప ఏమి లేదని గత అనుభవాలు వివరించారు.

గతంలో బావులు అద్దెకు తీసుకొని ట్యాంక్ ద్వారా నీరు వ్యవసాయ బావులకు సరఫరా చేసేది గతంలో తాగునీరు , సాగునీటి కష్టాలు ఉండేవన్నారు. మహారాష్ట్రలో ఇప్పటికి తాగునీరు సరఫరా ఇబ్బందులు ఉన్నాయన్నారు. పక్కా రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ చాలా అభివృద్ధి చెందిందనే విషయాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు చెప్పాలన్నారు. కలలో కూడా ఊహించిన పనులు కలలో కూడా రాని పనులు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేశామన్నారు. మాతాశిశు మరణాలు తగ్గించి దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. ఇవాళ దేశంలో 14వ స్థానం నుంచి 3వ స్థ్ధానంలో తెలంగాణ వైద్యం చేరుకుందన్నారు. కాళేశ్వరం నీళ్లు వస్తాయని ఎవ్వరు కూడా కలలో కూడా ఊహించలేదు. జరిగిన సాగు ప్రాజెక్టుల గురించి ప్రజలకు వివరించాలన్నారు.

దశాబ్ధి ఉత్సవాలను పండుగ వాతావరణంలో జరిపేలా అందరు సమష్టిగా పనిచేయాలన్నారు. జిల్లాలో 2 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యం కొన్నామని తెలిపారు. ఇంకా లక్షా టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చేద్దామని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేసేందుకు ప్రతిఒక్కరూ శక్తి వంచన లేకుండా పని చేయాలన్నారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేటలో 500 మందికి ఆటోనగర్‌లో కేటాయించిన స్థలాలు మంజూరు చేసుకున్నామని అన్నారు. నీళ్ల సంబురాల సందర్భంగా నీటి గోస వ్యధ గురించి గత కాలాన్ని వివరిస్తూ ఇప్పుడు సాధించిన ప్రగతి పరిస్థ్ధితుల గురించి ప్రజలకు చెప్పాలన్నారు.

సాగు నీటి దినోత్సవం సందర్భంగా సాయంత్రం రంగనాయక సంబరాలు చేద్దామన్నారు. రంగనాయకుడి నడి రిజర్వాయర్‌లో ఘనంగా చేద్దామన్నారు. పట్టణంలో కోమటి చెరువు వద్ద పండగ చేద్దామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన 1000 మందితో ప్రత్యేక సమావేశం నిర్వహిద్దామన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రతి పని కోసం సుదూరంలో ఉన్న సంగారెడ్డికి వెళ్లి వ్యయ ప్రయాసాలతో ఇబ్బందులు పడేవాళ్లమన్నారు. జిల్లాల పునర్విభజన పలు ప్రభుత్వ శాఖలు సంస్కరణల ద్వారా కొత్త జిల్లా ఏర్పాటు ,జిల్లా కార్యాలయాలు వచ్చాయన్నారు. ప్రభుత్వ సుపరిపాలన ప్రజల ముంగిట తెచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వం సాధించిందనే విషయాన్ని అర్ధమయ్యేలా ప్రజలకు వివరించాలన్నారు.

సాహిత్య దినోత్సవ పండుగ సందర్భంగా కవులు, రచయితలకు, సాహితి వేత్తలకు , కళలకు నిలయంగా ఉన్న సిద్దిపేటలో ఈ సాహిత్య దినోత్సవ వేడుకలు ఘనంగా చేద్దామన్నారు. పేదలకు సొంత అడుగు జాగలో ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం ఇచ్చే సాయం పథకం గృహలక్ష్మి ప్రారంభించుకుంటామన్నారు. న్యూట్రిషన్ కిట్స్ పథకం ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. పుట్టబోయే బిడ్డకు న్యూట్రిషన్ కిట్, పుట్టిన బిడ్డకు ఇచ్చేది కెసిఆర్ కిట్ అన్నారు. మున్సిపాలిటీ పట్టణ ప్రగతి గురించి నాడు నేడు అనే కోణంలో పోటో గ్యాలరీ ఘనంగా చేద్దామని తెలిపారు. గతేడాది 60 శాతం ఎక్కువగా వర్షపాతం ఉంది. ఈ యేడు సాధారణ వర్షపాతం కంటే 40 శాతం తక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికార వర్గాలు చెబుతున్నాయన్నారు. ప్రతి ఊరిలో 1000 మొక్కలు నాటాలని సూచించారు.

సిద్దిపేట చుట్టు జరిగే కొత్త రెండో రింగ్ రోడ్డు చుట్టూ రెండు వరసలో మొక్కలు నాటుకుందామని తెలిపారు. సిద్దిపేట నియోజవర్గ పరిధిలోని విద్య ప్రగతిలో వచ్చిన కొత్త మార్పు గురించి ప్రజలకు విద్య దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలన్నారు. అధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా అన్ని దేవాలయాలు , మసీదులు, చర్చిలలో తెలంగాణ ప్రభుత్వాన్ని దీవించేలా ప్రత్యేక పూజలు, ప్రార్థ్ధనలు చేయాలన్నారు. జూన్ 22 న సిద్దిపేట నియోజక వర్గ పరిధిలోని జనరల్ బాడి సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ అమరుల వీరుల పోరాటం పట్ల రెండు నిమిషాలు మౌనం పాటిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు డిసిపి మహేందర్, ప్రజాప్రతినిధులు , నాయకులు, అధికారులు కడవేర్గు రాజనర్సు, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, కూరమాణిక్యరెడ్డి, వంగ నాగిరెడ్డి, జాప శ్రీకాంత్, కోలా రమేశ్, రాగుల సారయ్య, రామచంద్రారావు, ఎల్లారెడ్డి, నముండ్ల రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News