Monday, December 23, 2024

విద్యా రంగంలో విప్లవాత్మకమైన ప్రగతి సాధించాం

- Advertisement -
- Advertisement -

టేకుమట : పుస్తక పఠనం ఓక్క వ్యక్తి యొక్క ప్రతిభా పాటవాలను పెంపొదిస్తుందని ఎమ్మెల్యే గండ్ర అన్నారు.టేకుమట్ల మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో విద్యా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన ఊరు మన బడి కింద సర్వాంగ సుందరంగా ప్రభుత్వ పాఠశాలలు తయారయ్యాయని అన్నారు. ఆహ్లదకరమైన వాతావరణంలో విధ్యనభ్యసించేలా పాఠశాలల అభివృద్ధి జరుగుతుందని అన్నారు. డిజిటల్ తరగతుల ద్వారా ఉన్నత విద్యార్థులకు విద్యా బోధన జరుగుతుందని, దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలు చదువులో పోటి పడుతున్నాయని అన్నారు.

కలెక్టర్ భవేశ్‌మిశ్రా మాట్లాడతూ ప్రతి పాఠశాలలో 12 రకాల మౌలిక వసతుల కల్పన జరిగిందని అన్నారు.విద్యార్థులకు ఉదయం అల్పహరం కింద రాగి జావా పంపిణీ చేస్తామని అన్నారు.విద్యార్థుల హజరు ప్రగతి వివరాల కోసం 303 ట్యాబ్‌లు అందజేస్తామన్నారు. రాఘవాపూర్ గ్రామంలో సిసి రోడ్లకు శంకుస్థాపన చేసి మన ఊరు మన బడి కార్యక్రమంలో పూర్తి చేసుకున్న పాఠశాలను ప్రారంభించారు. టేకుమట్ల మండల కేంద్రంలోని గ్రంథాలయ భవనానికి రూ. 15 లక్షల రూపాయలు మంజూరు చేశారు.ఈ కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులను, స్కూల్ ఛైర్మన్‌లను, పదవ తరగతి ఉత్తీర్ణతలో టేకుమట్ల మండలానికి మొదటి ర్యాంక్ వచ్చిన గునిగంటి సిరివల్లిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జడ్‌పి ఛైర్‌పర్సన్ జక్కు శ్రీహర్షిణి, అడిషనల్ కలెక్టర్ దివాకర,జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ బుర్ర రమేష్,ఎమ్‌పిపి మల్లారెడ్డి,జడ్‌పిటిసి పులి తిరుపతిరెడ్డి,మండల ప్రజా ప్రతినిధులు వివిధ గ్రామాల సర్పంచ్‌లు ఎమ్‌పిటిసిలు కార్యకర్తలు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News