Monday, December 23, 2024

రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులను ప్రజల వద్దకు తెచ్చాం

- Advertisement -
- Advertisement -

గన్‌ఫౌండ్రీ : దేశంలోనే వందకు వంద శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్‌స్టిట్యూషన్ డెలవరీలు జరుగుతున్న ఏకైక రాష్ట్రం తెలంగా ణ మాత్రమేనని కేంద్రం ప్రకటించిందని ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖామంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. బుధవారం కోఠీలోని కమీషనర్, ఆరోగ్య, కు టుంబ సంక్షేమశాఖ మరియు మిషన్ డైరెక్టర్ వారి కార్యాలయ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగినవ విలేఖర్ల సమావేశంలో ప్రి న్సిపల్ సెక్రెటరి శ్వేతామహంతి, డిఎంహెచ్‌ఈ గడల శ్రీనివాస్, టిఎస్‌ఎంఐడిసి చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్, కమీషనర్ అజయ్‌లతో కలిసి హరీష్‌రావు మాట్లాడారు.

నూతన కార్యాలయం ద్వారా మెరుగైన ఆరోగ్య సేవలు అం దించడానికి కమీషనర్ మరియు వారి స్టాఫ్ పని చేయాలని అన్నారు. సీజనల్ వ్యాధులపై ముందు జాగ్రత్తలు తీసుకునేందుకు జిల్లాలోని డిఎంహెచ్‌ఓలను అప్రమత్తం చేశామని తెలిపారు. వైద్య రంగంలో దేశానికే తలమానికంగా ఉన్న రాష్ట్రాన్ని గవర్నర్ అవగాహన రాహిత్యంతో బురద జల్లే ప్ర యత్నం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణ వైద్యరంగాన్ని నీతిఆయోగ్ ప్రశంసించిన విషయాన్ని గవర్నర్ గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.

2015 జూలైలో ఉస్మానియా సందర్శించిన ముఖ్యమంత్రి 200 కోట్లతో నూతన బిల్డింగ్ కట్టాలని ప్రకటిస్తే, 2015 ఆగష్టులో కోర్టుకు వెళ్ళి స్టేతెచ్చారని వెల్లడించారు. బస్తీ దవాఖానాలతో గాంధీ ,ఉస్మానియా ,నీలోఫర్‌లలో ఓపిల సంఖ్య తగ్గిందని అన్నారు. వైద్యరంగంలో ఎన్నో వినూత్న మార్పులు తెచ్చిన ప్రభుత్వాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శించడం రా జ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్‌కు తగ్గదని పేర్కోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News