Monday, January 20, 2025

తెలంగాణ అభివృద్ధికి సహకరించాం : కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

తెలంగాణ అభివృద్ధికి సహకరించాం : కిషన్ రెడ్డి
ముషీరాబాద్: ప్రధాని మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ అభివృద్దికి పూర్తి సహాయ, సహకారాలను అందించామని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణకు రూ. 5 లక్షల కోట్ల నిధులు తీసుకొచ్చామని ఆయన వెల్లడించారు. రిపోర్టు టు ద పీపుల్ అనే పేరుతో ఆర్టీసీ కళా భవన్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం పథకాలు, రాష్ట్రానికి తీసుకొచ్చిన నిధులు తదితర అంశాలను వివరించారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ గతంతో పోలిస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల వాటాను పెంచినట్టు తెలిపారు. తెలంగాణ అభివృద్దికి ప్రధాని మోడి నాయకత్వంలో ఎంతగానో సహకరించామని అన్నారు. కార్యక్రమంలో బిజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్, ఎమ్మెల్యే రఘునందన్ రావు, డికే అరుణ, ఎమెల్సీ ఏవిఎన్ రెడ్డి, బిజేపి మాజీ ఎమ్మెల్యేలు తదితర సీనియర్ నాయకులు హజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News