Wednesday, January 22, 2025

సమాజంలో కొత్త ఐడెంటిటీ కోసమే స్వేరో పదం సృష్టించాం : ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: సమాజంలో తరతరాలుగా తీవ్ర అణిచివేతకు గురైన జాతులకు కొత్త ఐడెంటిటీ ఇవ్వడం కోసమే స్వేరో పదం సృష్టించానని బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు, స్వేరోస్ నెట్వర్క్ వ్యవస్థాపకులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. స్వేరో పదానికి ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చోటు దక్కిన సందర్భంగా సోమవారం అబిడ్స్‌లోని ఆంధ్ర సారస్వత పరిషత్ లో ఏర్పాటు చేసిన స్వేరోస్ విజయోత్సవ సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో పురుడుపోసుకున్న స్వేరో పదం నేడు విశ్వవ్యాప్తమైందన్నారు. స్వేరో పదానికి తాను ఐడియాను మాత్రమే ఇచ్చానన్న ఆయన స్వేరో పదాన్ని ఖండాంతరాలు దాటించాల్సిన బాధ్యత గురుకుల విద్యార్థులు,పూర్వ విద్యార్ధులదే అన్నారు. స్వేరోయిజం ఏ కులానికో, మతానికో వ్యతిరేకం కాదన్నారు. స్వేరో పదం కేవలం నిర్వచనంతో ఆగొద్దన్న ఆయన కొత్త ఆలోచనలకు,అభిప్రాయాలకు స్ఫూర్తిగా ఉండాలన్నారు. ప్రతి స్వేరో గురుత్వాకర్షణ శక్తికి పోటీ పడి పనిచేసి,ఆకాశమే హద్దుగా విజయాలు సాధించాలన్నారు.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎం.వి.రెడ్డి, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫసర్ బంగ్యా భూక్యా, స్వేరోస్ చైర్మన్ ప్రవీణ్ మామిడాల, బల్గూరి దుర్గయ్య, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత పసునూరి రవీందర్ స్వేరో నాయకులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News