Friday, January 24, 2025

మాంసం దిగుమతి నుండి ఎగుమతికి అభివృద్ధి చెందాం

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మదిలో నుండి వచ్చిన అద్భుతమైన పథకం గొర్రెల పంపిణీతో రాష్ట్రంలో మాంసం దిగుమతి నుండి ఎగుమతి చేసే స్థాయిలో అభివృద్ధి చెందామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని టేకుమట్ల గ్రామంలో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 18 మంది లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వాట 70శాతం సబ్సిడీతో లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. గొర్రెల కాపరులకు ఈ పథకంతో ఎంతో ఆర్ధికాభివృద్ధి చెందాలనే సంకల్పంతోనే ఈ పథకాన్ని సిఎం కెసిఆర్ ప్రారంభించారని గుర్తు చేశారు. గొర్రెల కాపరులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రవీందర్ రెడ్డి, జడ్పిటిసి జీడి భిక్షం, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News