రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్
హైదరాబాద్ : సిపిఎస్‌పై సంపూర్ణ సమాచారంను రాష్ట్ర ఎక్సైజ్ క్రీడా శాఖల మంత్రి వి శ్రీనివాస్ గౌడ్‌కు అందజేసినట్లు
తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ , ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ ,కోశాధికారి నరేష్ గౌడ్‌లు వెల్లడించారు. ఈ మేరకు శనివారం బిఆర్‌ఎస్ శాసనసభ పక్ష కార్యాలయంలో వారు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కలిసి సిపిఎస్ విధానం వల్ల అటు ఉద్యోగులకు, ఇటు ప్రభుత్వానికి జరిగుతున్న నష్టాలను ఆధారాలతో సహా అందచేసినట్లు తెలిపారు.
రాష్ట్రంలో 1,72,000 కుటుంబాలు ఈ విధానంలో పడుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కోరినట్లు తెలిపారు. ఇందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందిస్తూ సానుకూలంగా స్పందించారని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కూరకుల శ్రీనివాస్,మ్యాన పవన్, గడ్డం వెంకటేశ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు నరేందర్ రావులు పాల్గొన్నారు.