కరీంనగర్: శివారు ప్రాంతాలు,విలీన గ్రామాల డివిజన్ల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టామని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి లో భాగంగా బుదవారం రోజు మేయర్ యాదగిరి సునీల్ రావు, కమీషనర్ సేవా ఇస్లావత్ 2 వ డివిజన్ తీగలగుట్టపల్లిలో పర్యటించారు.
విద్యారణ్య పురి రోడ్డు నెం2 లో స్థానిక కార్పోరేటర్ కాశెట్టి లావణ్య శ్రీనివాస్ తో కలిసి నగరపాలక సంస్థ కు చెందిన 11 లక్షల నిధులతో సీసీ డ్రైనేజీ అభివృద్ధి పనులకు భూమీ పూజ చేసి ప్రారంభించారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్ ను ఆదేశించారు. కాంట్రాక్టర్లు టెండర్ తీస్కు న్న తర్వాత పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేయకుంటే శాఖ పరమైన చర్యలు తీస్కుంటామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ 2 వ డివిజన్ తీగలగుట్టపల్లి, వల్లంపహాడు ప్రాంతాలు గతంలో గ్రామ పంచాయితీ పరిదిలో ఉండేవి కాబట్టి డివిజన్ లోని చాలా ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. నగరపాలక సంస్థ లో కలిసిన తీగలగుట్టపల్లి, వల్లంపహాడు ప్రాంతాలను సమాంతరంగా అభివృద్ధి చేసేందుకు నగరపాలక సంస్థ పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందన్నారు. డివిజన్ అభివృద్ధి కోసం ఇప్పటి వరకు దాదాపు 8 కోట్ల రూ. నిధులు కేటాయించి వివిధ రకాల అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందని తెలిపారు.
2 వ డివిజన్ చాలా పెద్ద ప్రాంతమని,బుట్టిరాజారాం కాలనీ నుండి వల్లంపహాడు వరకు డివిజన్ విస్తరించి ఉందన్నారు. చాలా వరకు డివిజన్ లో సమస్యలు ఉండటం జరిగిందని… ప్రతి సమస్యను కార్పోరేటర్ మాట దృష్టికి తేవడంతో ప్రతి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీస్కుంటున్నామన్నారు. ఇప్పటికే నగరపాలక సంస్థ 4 కోట్ల సాధరణ నిధులు, సీఎం అస్యూరెన్స్ కు చెందిన 3 న్నర కోట్ల నిధులు, 15 ఫైనాన్స్ కు చెందిన 80 లక్షల నిధులు కేటాయించి అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు కొన్ని పనులు పూర్తి కాగా మరి కొన్ని పనులు చేయాల్సి ఉందని తెలిపారు.
సీఎం అస్యూరెన్స్ కు సంబంధించిన 3 న్నర కోట్ల రూపాయల నిధుల పనులు జులై మాసంలో ప్రారంభించి పూర్తి చేస్తామన్నారు. దీంతో డివిజన్ లోని విద్యారణ్యపురి, మాణిక్యేశ్వర నగర్, వల్లంపహాడు ప్రాంతాల సమస్యలకు పరిష్కారం అవుతాయన్నారు. అంతే కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నగరపాలక సంస్థ మీద ఉన్న ప్రేమతో మల్లీ అదనంగా మరో 132 కోట్ల రూపాయల నిధులు నగర అభివృద్ధి కోసం విడుదల చేయడం జరిగిందన్నారు.
మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ నిధులకు కృషి చేసి తీస్కరావడం జరిగిందని తెలిపారు. ఈ నిధులతో నగర వ్యాప్తంగా ఉన్న చాలా వరకు పెండింగ్ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. 2 వ డివిజన్ లో ప్రజలకు మంచి నీటి సమస్యను తీర్చేందుకు గతంలోనే మంచి నీటి పైపులైన్ కు టెండర్ పిలిచి పనులు ప్రారంభం చేశామన్నారు. ఇప్పటికే పనులు పూర్తై మంచి నీరు సరఫరా అవ్వాల్సి ఉండగా కాంట్రాక్టర్ డీలే వల్ల కొంత ఆలస్యం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం పనులు చివరి దశకు చేరాయన్నారు.
మచ్చే జులై మాసంలొ 2 వ డివిజన్ ప్రజలకు మంచి నీటిని సరఫరా చేస్తామని తెలిపారు. డివిజన్ లో వీది దీపాలకు సంబంధించిన సమస్యలు చాలా వరకు పరిష్కరించామని తెలిపారు. డివిజన్ లో ప్రతి వీదిలో చక్కటి లైటింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. అంతే కాకుండా శివారు ప్రాంతాలు విలీన గ్రామాల డివిజన్ ల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. పెద్ద ఎత్తున నిధులను కేటాయించి ప్రతి విలీన గ్రామం డివిజన్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
త్వరలోనే కరీంనగర్ నుండి తీగలగుట్టపల్లి మీదుగా నగునూరు వరకు సెంటర్ లైటింగ్ కూడ ఏర్పాటు చేసేందుకు ప్రపోజల్స్ పెట్టామన్నారు. ఆర్ బి శాఖ రోడ్డు విస్తరణ పనులు పూర్తైన తర్వత సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. కరీంనగర్ నగరపాలక సంస్థ ను సమగ్రంగా సంపూర్ణంగా అభివృద్ధి చేయాలనే గొప్ప లక్ష్యంతో మా పాలకవర్గం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ నాగమల్లేశ్వర్ రావు, ఈఈ మహేంధర్, డీఈ మసూద్ అలీ, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.