Monday, December 23, 2024

సాగునీటి రంగంలో అద్భుత ప్రగతి సాధించాం

- Advertisement -
- Advertisement -

ఇల్లందు : గడిచిన తొమ్మిదేళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగంలో తీవ్రంగా శ్రమించి ప్రగతి సాధించిందని స్థానిక ఎంఎల్‌ఎ బానోత్ హరిప్రియ హరిసింగ్‌నాయక్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె బుధవారం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇల్లందులపాడు చెరువుకట్ట వద్ద నిర్వహించిన సాగునీటి దినోత్సవ కార్యక్రమంలో పాల్గోని మాట్లాడారు. మానవ జీవన విధానంలో ప్రతిరోజు నీటితో ముడిపడి వుందని, అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి 46,500 చెరువులను పూడిక తీయించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందన్నా రు. నియోజకవర్గంలోని మండలాలలో 17 చెక్ డ్యామ్‌లను 44.99కోట్లతో నిర్మించామని, తద్వారా 3366 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా నియోజకవర్గంలోని 333 చెరువులకు పూడిక తీయించి రూ.65.53 కోట్లతో అభివృద్ధి చేయటం వలన నీటినిల్వ 3015.92 ఎమ్‌సిఎఫ్‌టిలకు పెరిగి చెరువుల క్రింద ఆయకట్టు 35435 ఎకరాలకు సాగు జరుగుతుందన్నారు. సీతారామ ప్రాజెక్టు సర్వే పూర్తిచేసుకోని పనులకోసం రూ.3320 కోట్లలను సిఎం కెసిఆర్ మం జూరు చేశారని, తద్వారా అన్ని మండలాలకు నీటికొరత లేకుండా పోతుందన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబా బాద్ జిల్లా పరిషత్ చైర్మన్ ఆంగోత్ బిందు, జెడ్పిటిసి ఉమాదేవి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, వైస్‌చైర్మన్ జానీపాష, మున్సిపల్ కమిషనర్ అంకుషావళి, తహసీల్దార్ కృష్ణవేణి, ఇరిగేషన్ ఇఇ శ్రీనివాసచారీ, పలువురు సర్పంచ్‌లు, ఎమ్‌పిటిసిలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News