Wednesday, January 22, 2025

ఇబ్బందుల్లో ఉన్నా ఏడు పెండింగ్ డిఏలను చెల్లించాం

- Advertisement -
- Advertisement -

ప్రయాణికులకు అనుగుణంగా అధునాతన సౌకర్యాలను ప్రవేశపెట్టాం
ఆర్టీసి చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్

మనతెలంగాణ/హైదరాబాద్:  సంస్థ ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ సిఎం కెసిఆర్ సహకారంతో సంస్థ ఉద్యోగులకు ఏడు పెండింగ్ డిఏలను చెల్లించిందని ఆర్టీసి చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. సంస్థలో ప్రయాణికులకు అనుగుణంగా అధునాతన సౌకర్యాలను ప్రవేశపెట్టామన్నారు. టిఎస్‌ఆర్టీసి బస్‌భవన్ ప్రధాన కార్యాలయంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండి సజ్జనార్‌తో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం కాలానికి అనుగుణంగా ప్రయాణికుల భద్రతకోసం సిసి కెమెరాలు, వెహికల్ లొకేషన్, ట్రాకింగ్ సిస్టం, ఫైర్ డిటెన్షన్, అలారం, అడ్వాన్స్ టెక్నాలజీతో కూడిన ఎలక్ట్రానిక్, సూపర్ లగ్జరీ, స్లీపర్ క్లాస్ బస్సులను లాంఛనంగా ప్రారంభింకున్నామన్నారు. ఈ సంస్థను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసే సమయంలో తాను చైర్మన్‌గా ఉండడం చాలా సంతోషకరమన్నారు. దీనిని అదృష్టంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. ఇది తనకు తృప్తిగా ఉందని, తాను జీవితంలో మర్చిపోలేని విజయమన్నారు. అధికారులు ఈడిలు, రీజనల్ మేనేజర్లు, డిపో మేనేజర్లు వివిధ విభాగాల్లో పనిచేసే అధికారులు సిబ్బంది ఎంతగానో కష్టపడి పనిచేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ వైస్ చైర్మన్, ఎండి విసి సజ్జనార్, ఈడీ మునిశేఖర్, ఈడిఏ కృష్ణ కాంత్, జాయింట్ డైరెక్టర్ సంగ్రామ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News