Friday, December 20, 2024

మ్యానిఫెస్టో అమలుకు ఆర్థిక అంశాలు ప్రజల ముందు పెట్టాం: మంత్రి శ్రీధర్ బాబు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో ప్రజలకు పూర్తిగా అందించాలనే ఉద్దేశంతో ఆర్థిక అంశాలు ప్రజల ముందు పెట్టినట్లు శానససభ వ్యవహారాల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు చెప్పారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ గత 10ఏళ్ళ బిఆర్‌ఎస్ పాలనపై అసెంబ్లీ లో శ్వేత పత్రం విడుదల చేశామని, రాష్ట్రంలో ప్రతి యువకుడిపై రూ. 7 లక్షల అప్పును గత ప్రభుత్వం మోపిందన్నారు. కాంగ్రెస్ ఆనాడు అభివృద్ధి అడుగులు వేసినట్లు తరువాత ప్రభుత్వం నిర్లక్ష్యం చేశాయని మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ముందు చూపు లేకపోతే రోజుకు 12 గంటల కరెంట్ సరఫరా అయ్యేది కాదన్నారు. గత పదేళ్లలో ప్రభుత్వ విద్యా విధానం ఎలా ఉంది అంటే ప్రతిపక్ష సభ్యులు తెల్లమొహం వేసుకోని కూర్చున్నారని ఎద్దేవా చేశారు. మూడు ఎకరాల భూమి పంపిణీ, ఎస్సీ , ఎస్టీలకు నిధుల కేటాయింపులపై సమాధానం చెప్పలేక పోయారని పేర్కొన్నారు. అసెంబ్లీలో పెట్టిన ప్రతి లెక్క వాస్తవమని, కావాలంటే స్పీకర్ ఆదేశంతో ప్రతి సభ్యుడికి అందిస్తామని, శ్వేత పత్రం లెక్కలు ఎవరిని కించపరచడానికి సభలో ప్రవేశపెట్టలేదన్నారు. రాష్ట్ర ప్రజలు ఎవరు అనుమానపడవద్దని కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, వ్యవసాయం, పరిశ్రమలు,  డోమెస్టిక్ వినియోగ దారులకు పూర్తి స్థాయిలో కరెంట్ ఇస్తామని తెలిపారు. ప్రజాస్వామ్య దృక్పథంతో లెక్కలు ప్రజల ముందు పెట్టినట్లు వెల్లడించారు. మా ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశామని, గత ప్రభుత్వం పాలనలో తప్పులు జరిగాయని విమర్శించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News