Monday, December 23, 2024

సత్తుపల్లి అభివృద్ధికి రూ.172 కోట్లు ఖర్చు చేశాం

- Advertisement -
- Advertisement -

సత్తుపల్లి : సత్తుపల్లి పట్టణ అభివృద్ధికి రూ. 172 కోట్లు ఖర్చు చేసినట్లు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య అన్నారు. శుక్రవారం సత్తుపల్లి మున్సిపాలిటిలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో సఫాయి, కర్మచారుల్ని గుర్తించి వారికి గౌరవ ప్రదం కల్పించాలని మన రాష్ట్ర ప్రభుత్వం సఫాయి కర్మచారుల భాగస్వామ్యంతో మునిసిపల్ కార్యాలయంలో సఫాయి అన్న సలాం అన్న, సఫాయి అమ్మ సలాం అన్న స్లోగన్ తో విగ్రహాలు ఏర్పాటుచేసినట్లు, సఫాయి కార్మికుల సేవల గుర్తింపుకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నేడు పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సత్తుపల్లి పట్టణం మూడు సంవత్సరాల్లో వేగవంతంగా అభివృద్ధి చెందిందన్నారు. నగరాలకు దీటుగా షాపింగ్ మాల్స్, వ్యాపార, వాణిజ్య రంగాలు వెలిశాయని, 2020 సంవత్సరంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పరిశీలకులుగా తాను సత్తుపల్లికి రావడం జరిగిందని అప్పుటికి ఇప్పటికి గుర్తించలేనంతగా అభివృద్ధి చెందిదన్నారు. సఫాయి కర్మచారులు కోవిడ్ సమయంలో తమ ప్రాణాలను సైతం లేక్కచేయకుండా విధులు నిర్వర్తించి పారిశుధ్య పనులు చేశారని, ఇకముందు కూడా ఇదే విధంగా సేవలు అందించాలన్నారు. సఫాయి కర్మచారుల సేవలను గుర్తించిన ప్రభుత్వం వేతనాలు ఏడు వేల నుంచి డబుల్ చేశామన్నారు.

సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయం, కౌన్సిల్ హాల్ కార్పొరేట్ ఆఫీసులకు దీటుగా నిర్మించుకున్నామన్నారు. అదేవిధంగా విశాలమైన రోడ్లు మూడు సంవత్సరాల్లో ఊహించలేనంతగా అభివృద్ధి చెందిందన్నారు. ఈ సందర్భంగా ఇంత చక్కగా నడిపిస్తున్న పాలకవర్గాన్ని కలెక్టర్ అభినంధించారు. సత్తుపల్లి శాసనసభ్యులు నిరంతరం నిధులు తెప్పిస్తూ టిఎఫ్‌ఐ డిసి నుంచి 26 కోట్లు నిధులు తెప్పించామన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయించడం జరిగిందన్నారు. ఐదు, ఆరు నెలల్లో పనులన్నీ పూర్తి అవుతాయన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా సత్తుపల్లి మున్సిపాలిటీకి 30 కోట్లు మంజూరు చేశామని, అట్టి నిధులతో అభివృద్ధి పనులను పూర్తి చేసుకొని సతుపల్లి పట్టణం రూపురేఖలు మారిపోతాయన్నారు.

అభివృద్ధిలో భాగస్వాములవుతున్న మున్సిపల్ సిబ్బంది, అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ సత్తుపల్లి పట్టణానికి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కె.చంద్రశేఖర్‌రావు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు కెటిఆర్ విజన్, చొరవతో నిధులు సమకూర్చి పట్టణాన్ని ఖమ్మం నగరానికి ధీటుగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు సత్తుపల్లి పట్టణం నేటి సత్తుపల్లి పట్టణం అభివృద్ధిని గమనించాలన్నారు. 2014 నుండి ఇప్పటి వరకు 171 కోట్లు 60 లక్షల నిధులు మంజూరు చేశామన్నారు. అట్టి నిధులతో సత్తుపల్లి నగరాన్ని అభివృద్ధి పర్చామన్నారు.

మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. సత్తుపల్లి పట్టణంలో అర్భన్ పార్కు ఉండడం ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం జరిగిందన్నారు. సత్తుపల్లి పట్టణంను జిల్లా కలెక్టర్ మూడు సంవత్సరాల క్రితం వచ్చిన సందర్భంలో ఎలా ఉందో నేడు ఎంత అభివృద్ధి చెందిందో తెలియజేయడం జరిగిందన్నారు. మరో 35 కోట్ల రూపాయలతో వంద పడకల ఆసుపత్రిని నిర్మించుకోవడం జరుగుతుందన్నారు. పట్టణంలో డాబి.ఆర్ అంబేద్కర్ పేరున నూతన ఏ.సి ఆడిటోరియంను నిర్మించుకోవడం జరుగుతుందన్నారు. మైనారిటీ సోదరులకు రూ. 2 కోట్లతో షాదిఖానాను నిర్మించేందుకు టెండర్లు పూర్తి చేయడం జరిగిందన్నారు.

రజకులకు మోడ్రన్ దోభీఘాట్ కం కమ్యూనిటీ హాల్ నిర్మాణం పిల్లర్ల నిర్మాణం జరుగుతుందన్నారు. పట్టణ ప్రజల అవసరాల మేరకు తామర చెరువును బతుకమ్మ ఘాట్‌గా మార్చి నిర్మాణం పనులను జరుగుతున్నాయన్నారు. సత్తుపల్లి ఊరు చివరనున్న చెరువును అత్యంత సుందరంగా తీర్చి దిద్ది పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే పనులు జరుగుతు న్నాయన్నారు. అంతకు ముందు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులతో జి.వి మాల్ నుండి పురపాలక సంఘం వరకు చేపట్టిన ర్యాలీని కలెక్టర్ సత్తుపల్లి శాసనసభ్యులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.

కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, మున్సిపల్ కమీషనర్ సుజాత, రెవెన్యూ డివిజనల్ అధికారి సూర్యనారాయణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమా మహేశ్వరరావు, ఏ.సి.పి రామానుజం, మున్సిపల్ వైస్ చైర్మన్ సుజలారాణి, ఎం.పి.పి హైమావతి, పెనుబల్లి అలేఖ్య, జడ్‌పిటిసి రామారావు, తహశీల్దార్ శ్రీనివాసరావు, ఎం.పి.డి.ఓ సుభాషిణి, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిదులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News