Wednesday, January 22, 2025

అవును.. మోటార్లకు మీటర్లు పెట్టనందుకే నిధులకు కోత

- Advertisement -
- Advertisement -

ఇతర రాష్ట్రాల మాదిరిగానే బిగిస్తే నిధులు విడుదల చేస్తాం
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రైతులు బోరు, బావులకు కరెంటు మీటర్ల పెట్టనందుకే కేంద్రం నుంచి రావాల్సిన రూ. 25 వేల కోట్లు నిధులు నిలిపివేశామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లో ఎన్నికల ప్రచారం చేపట్టిన ఆమె అక్కడ ఏర్పాటు చేసిన ‘మీట్ ది గ్రేట్’ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈసందర్భంగా మాట్లాడుతూ రైతుల కరెంటు మోటార్లకు మీటర్ల వెంటనే ఏర్పాటు చేయాలని ఇతర రాష్ట్రాలకు సూచించడంతో ఆయా రాష్ట్రాలు రైతులకు అవగాహన చేసి మీటర్లు పెట్టారని వారికి నిధులు కేటాయించామని, తెలంగాణలో ఏర్పాటు చేయనందుకు నిధులు విడుదల చేయలేదని చెప్పారు. ఇప్పటికైన మీటర్లు ఏర్పాటు చేస్తే పెండింగ్‌లో ఉన్న నిధులు విడుదల చేసే విషయం ఆలోచిస్తామని పేర్కొంది. సిఎం కెసిఆర్,  ప్రధాని నరేంద్ర మోడీకి మోటార్లు ఏర్పాటు చేయబోమని చెప్పినట్లు పలు సందర్భాల్లో తెలిసిందని, అది నిజంకాదు… కేంద్రం తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై ప్రధానమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారని, తెలంగాణలో బిసి నేతను ముఖ్యమంత్రి చేసి తీరుతామన్నారు. జనవరి 22వ తేదీన అయోధ్య రామమందిరం ప్రారంభిస్తామని తెలంగాణ నుంచి వృద్దులను ఉచితంగా తీసుకెళ్లుతామని తెలిపారు.

రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉందని,  దీంతో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెంది రెవెన్యూ కేంద్రంగా మారడంతో రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నార. కోవిడ్ సమయంలో ఆర్దిక సంక్షోభం రాకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకుని భవిష్యత్తులో రాష్ట్రాలకు ఆర్ధిక భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చే ఆలోచన కేంద్రానికి లేదని పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వర్గీకరణపై బిల్లు ప్రవేశపెడతామన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News