Monday, January 20, 2025

మారుతున్న కాలానికి అనుగుణంగా మనం మారాలి : మేయర్ జక్క వెంకట్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

బోడుప్పల్: మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యక్తిగత పరిశుభ్రతపై బాలికలు మరింత శ్రద్ధ పెట్టాలని, పీరియడ్స్ అనేవి అత్యంత సహజసిద్ధ్దమైన ప్రక్రియ అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని మేయర్ జక్క వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యంగా కుటుంబ సంక్షేమ శాఖ అధ్వర్యంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బస్తీ దవాఖానాలో కౌమార బాలికలలో రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడంతో పాటు ఉచితంగా శానటరీ ప్యాడ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు బొడిగే స్వాతికృష్ణగౌడ్, బైటింటి శారదా ఈశ్వర్ రెడ్డిలు పాల్గొన్నారు.

అనంతరం వారు మాట్లాడుతూ పీరియడ్స్ గురించి బహిరంగంగా మాట్లాడడం ఏమాత్రం తప్పుకాదని, ఈ విషయాన్ని గురించి మాట్లేందుకు సిగ్గుపడాల్సిన పనిలేదన్నారు. సరైన అవగాహన లేకపోవడంతో పీరియడ్స్ సమయంలో వ్యక్తిగత పరిశుభ్రతలో లోపాలు ఏర్పడతాయని, తద్వారా అనేక ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందన్నారు. పీరియడ్స్ నిర్వహణలో పాత పద్ధ్దతులకు దూరంగా ఉండాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో మహిళలకు భద్రత అందించడంతో పాటు ఆరోగ్యం,కుటుంబ సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చెస్తున్నారన్నారు.

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టల్స్‌లో కూడా బాలికలకు శానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేయడం జరుగుతుందున్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ డీఎమ్‌ఎచ్‌వో పట్ల శ్రీనివాస్, కార్పొరేటర్లు దొంతిరి హరిశంకర్ రెడ్డి, అనంత రెడ్డి, బచ్చరాజు, నాయకులు ఈశ్వర్ రెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ జానకి, డాక్టర్ భార్గవి , సీనియర్ నర్స్ మోనిక , ఆశా వర్కర్స్ వియజలక్ష్మి , జ్యోతి షాహీదా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News