Sunday, December 22, 2024

గోదావరి బోర్డు ఉన్న సిబ్బందితోనే సర్దుకు పోవాల్సిందే

- Advertisement -
- Advertisement -

2024-25లో నిర్వహణకు రూ.10కోట్లు
ఆమోదం తెలిపిన తెలుగు రాష్ట్రాలు

మనతెలంగాణ/హైదరాబాద్:  గోదావరి నదీయాజమాన్య బోర్డుకు అదనపు సిబ్బంది అవసరం లేదని తెలుగు రాష్ట్రాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం ఉన్న సిబ్బందితోనే సర్దుకు పోవాలని బోర్డుకు సూచించాయి. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి బోర్డు నిర్వహణకోసం రూ. 10కోట్లు అందజేసేందుకు తెలంగాణ.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఆమోదం తెలిపాయి. బోర్డు చైర్మన్ ఎన్‌కే సిన్హా అధ్యక్షతన జరిగిన సమావేశంలో రెండు రాష్ట్రాలు పలు అంశాలపైన స్పష్టతనిచ్చాయి. బోర్డు నిర్వహణకు నిధులు , అదనపు సిబ్బంది కేటాయింపులతోపాటు పలు అంశాల్లో ఏకాభిప్రాయం వెలిబుచ్చాయి.

ఏపిలో గోదావరి నదీజలాల ఆధారంగా చేపట్టిప పలు ప్రాజెక్టులకు డిపిఆర్‌లను బోర్డుకు సమర్పించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. చింతల పూడి, వెంకటనగరం, పురుషోత్తమపట్నం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టల డిపిఆర్‌లను మే నాటికి అందజేస్తామని ఏపి ప్రభుత్వం బోర్డకు తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా శ్రీపాద ఎల్లంపల్లి ఎత్తిపోతల, వరద కాలువ విస్తరణ, శ్రీరాంసాగర్ రెండవ దశ విస్తరణ పనులకు అనుమతులు ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. కుఫ్టి పథకం డిపిఆర్ త్వరలోనే సమర్పిస్తామని తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని అదనపు టిఎంసి పనులు ఈ పథకంలో అంతర్బాగమైనందున ప్రత్యేక డిపిఆర్ లేదని తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News