న్యూఢిల్లీ: నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి ప్రభుత్వం ప్రతిఒక్కరిని ఆహ్వానించిందని, అయితే ఎవరి మనోభావాల మేరకు వారు స్పందిస్తారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. మే 28న జరగనున్న నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలన్న 19 ప్రతిపక్ష పార్టీల నిర్ణయంపై ఆయన స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతిఒక్కరిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించిందని, అయితే ఎవరి మనోభావాల మేరకు వారు స్పందిస్తారంటూ తెలిపారు.
1947లో అప్పటి బ్రిటిష్ పాలకుల నుంచి స్వతంత్ర భారతదేశానికి అధికార మార్పిడి సందర్భంగా లభించిన రాజదండాన్ని మే 28న జరిగే నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంలో తమిళనాడుకు చెందిన ప్రముఖులతో కూడిన ప్రతినిధి బృందం ప్రధాని నరేంద్ర మోడీకి అంచేస్తుందని అమిత్ షా తెలిపారు.
చోల సామ్రాజ్యంలో ఒక రాజు నుంచి మరొక రాజుకు అధికార మార్పిడికి చిహ్నంగా అందచేసుకునే రాజదండం 1947లో బ్రిటిష్ పాలకుల నుంచి స్వతంత్ర భారతదేశానికి అధికార బదలాయింపు సూచికగా మార్పిడి జరిగింది. అప్పట్లో భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఈ రాజదండాన్ని తమిళనాడుకు చెందిన స్వామీజీల నుంచి అందుకున్నారు. అనంతరం తమిళనాడులోని మ్యూజియంలో భద్రపరిచిన ఈ రాజదండాన్ని నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ ం సందర్భంగా తమిళనాడుకు చె౭ందిన ప్రతినిధి బృందం నుంచి అందుకుంటారు. దీన్ని లోక్‌సభ స్పీకర్ స్థానానికి సమీపంలో ఉంచుతారు.