Friday, December 20, 2024

మాట నిలుపుకున్నాం… మళ్లీ ఆశీర్వదించండి

- Advertisement -
- Advertisement -
  • సీఎం కేసిఆర్ సభకు భారీగా తరలిరావాలి
  • రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

వనపర్తి ప్రతినిధి: ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి మాట నిలుపుకున్నామని మళ్లీ ఒకసారి ఆశీర్వదించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కోరారు. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసిఆర్ సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సభ ఏర్పాట్లను పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తిని జిల్లా చేశాం.. పెబ్బేరులో మత్స కళాశాల ఏర్పాటు చేశామని అన్నారు.

2018 ఎన్నికలలో ఇచ్చిన మాటప్రకారం ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలతో పాటు అదనంగా నర్సింగ్, వ్యవసాయం మహిళా డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు. సమీకృత మార్కెట్, టౌన్ హాల్, వ్యవసాయ మార్కెట్ గోదాంలు , మిషన్ భగీరథ, పథకం కింద తాగు నీరు అందిస్తున్నామని చెప్పారు. వనపర్తి రహదారుల విస్తరణ పూర్తి చేశాం.. ప్రతిష్టాత్మకంగా ఐటీ టవర్ నిర్మించుకోబోతున్నామని అన్నారు. 15 చెక్ డ్యాంలు పూర్తి చేసి, మరో 20 చెక్ డ్యాంలకు ప్రతిపాదనలు పంపామన్నారు. నియోజకవర్గంలో లక్ష 25వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సహకారంతో చెప్పినవి, చెప్పని పనులు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహకార యూనియన్ సభ్యులు, తిరుమల, మహేష్, జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, కౌన్సిలర్ నాగన్న యాదవ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News