Wednesday, January 22, 2025

హరితోద్యమంలో భాగస్వాములు కావాలి : సుభాష్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రతి ఒక్కరూ హరితోద్యమంలో భాగస్వాములు కావాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కోరారు. తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా శనివారం కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులతో కలిసి తన నివాసంలో మొక్కను సుభాష్ రెడ్డి నాటారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. హబ్సిగూడలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలను ఆయన నిర్వహించారు.
మొక్కలు నాటి సంరక్షించాలి : కిశోర్‌గౌడ్
వాతావరణం బాగుంటేనే ఈ భూమిపై మానవ మనుగడ సాధ్యమని రాష్ట్ర బిసి కమిషన్ సభ్యులు కిశోర్‌గౌడ్ అన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా శనివారం అంబర్‌పేట పార్క్‌లో మొక్కలను ఆయన నాటారు. ఈ సందర్భంగా కిశోర్ గౌడ్ మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంపొందించి, వాతావరణ కాలుష్యం తగ్గించడం కోసం రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్ ఆరు సంవత్సరాల క్రితం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమాన్ని చేపట్టి పల్లె నుంచి దేశ, విదేశాలకు విస్తరించే విధంగా చైతన్యం తీసుకురావడం జరిగిందని అన్నారు. భవిష్యత్ తరాలకు మనం ఎంత ఆస్తి ఇచ్చామనేది కాకుండా ఎంత మంచి వాతావరణాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చాము అనేది ముఖ్యమని అన్నారు. ప్రతి సందర్భంలో మొక్కలు నాటడం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని రక్షించాలని ఆయన కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News