Thursday, January 23, 2025

ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కావాలి

- Advertisement -
- Advertisement -

రామగిరి : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత ముఖ్యమైందని, ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని మంథని ఆర్‌డివో వీరబ్రహ్మయ్య పిలుపునిచ్చారు. ఛీఫ్ ఎలక్షన్ కమీషన్ పిలుపు మేరకు రెవెన్యూ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో బుధవారం జెఎన్‌టియుహెచ్ యూనివర్శిటీ మంథని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు స్వీప్(సిస్టమెటిక్ వోటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్షన్ పార్టిసిపేషన్)పై ఓటర్లకు అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీ నిర్వహించారు.

ఇట్టి ర్యాలీని ఆర్‌డివో ముఖ్యఅతిధిగా హజరై ప్రారంభించారు. ప్లకార్డులు, బ్యా నర్లు, పోస్టర్లతో కళాశాల ప్రాంగణంలో ప్రారంభమైన ర్యాలీ ఆర్‌జి3 జిఎం కార్యాలయంలో వరకు కొనసాగింది. జిఎం కార్యాలయ చౌర స్తాలో విద్యార్థులు, అధికారులు పెద్ద ఎత్తున మానవహరం నిర్వహించారు.

ఓటర్లను చైతన్య పరిచే విధంగా నినాదాలు చేశారు. అనంత రం వైస్ ప్రిన్స్‌పాల్ చెరుకు శ్రీధర్‌రెడ్డి అధ్యక్షతన సెమినార్ హల్‌లో స్వీప్‌పై జరిగిన అవగాహన సమావేశంలో ఆర్‌డివో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ర్యాలీ, మానవహరం నిర్వహించినట్టు చెప్పారు.

అర్హులైన ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవడంతో పాటు ఓటు హక్కు వినియోగించు కోవాలన్నారు. ఓటు నమోదు కార్యక్రమం సం వత్సరం పొడవున జరుగుతుందన్నారు. ప్రతి గ్రామంలో ఉండే బూత్ స్థాయి అధికారిని కలిసి ఓటు నమోదు చేసుకోవచ్చు అన్నారు. అలాగే నేషనల్ ఓటర్స్ పోర్టల్ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు.

జన్మదిన ధృవపత్రంతో పాటు ఆధార్‌కార్డు అప్‌లోడ్ చే యాల్సి ఉంటుందన్నారు. అక్టోబర్ 1, 2023 నాటికి 18 సంవత్సరాలు నిండే వారు ముందస్తుగా ఓటు నమోదు చేసుకునేందుకు ఎలక్ష న్ కమీషన్ అవకాశం కల్పించిందన్నారు. ఓటు హక్కును ఆలోచించి అభ్యర్థులకు ఓటు వేయాలని సూచించారు.

అర్హులుగా ఉండి ఓటు లేని వారిని సైతం నమోదు చేసుకునే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో రామగిరి తహసిల్దార్ రాం మోహన్, కలెక్టర్ కార్యాలయ సూపరింటెండ్ రవీందర్, కళాశాల టీచింగ్, నాన్‌టీచింగ్, రామగిరి రెవెన్యూ సిబ్బంది, నాలుగు సం వత్సరాల విద్యార్థులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News