- Advertisement -
మనతెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో టిఎస్ ఐపాస్ ద్వారా ఇండస్ట్రీయల్ పాలసీ తీసుకొచ్చామని, తద్వారా పదిహేను రోజుల్లో అనుమతులు లభిస్తాయని మున్సిపల్, ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కెటిఆర్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు టిఎస్ ఐపాస్ ద్వారా 17,500 పరిశ్రమలకు అనుమతులిచ్చామని చెప్పారు. రాష్ట్రానికి రూ.2,30,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని, లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించామని పేర్కొన్నారు. మరిన్ని పెట్టుబడులు రావడానికి చాలా ఉపయోగపడుతుందన్నారు. ఐఏఎంసీకి అవసరమైన అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందని మంత్రి కెటిఆర్ తెలిపారు.
We Permissioned to 17500 companies by TS iPASS: KTR
- Advertisement -