Monday, January 20, 2025

ప్రతి ఎకరాకు సాగు నీరు అందిస్తాం

- Advertisement -
- Advertisement -

గద్వాల ప్రతినిధి: ధరూర్ మండల పరిధిలోని గూడెందొడ్డి వద్ద ఉన్న నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ఫేస్ వన్ నుంచి ఆదివారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పంపు మోటార్లు ఆన్ చేసి గూడెందొడ్డి, ర్యాలంపాడు రిజార్వయర్లకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తర్వాత బిఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

ముఖ్యంగా రైతులకు రైతుబంధు, వ్యవసాయానికి 24గంటలు ఇవ్వడంతో పాటు.. సాగు నీటి అవసరాల కోసం రిజార్వయర్‌లను పూర్తి చేసి వ్యవసాయానికి పెద్ద పీట వేసిందన్నారు. జూరాలలో ఉన్న నీటి నిలువల ప్రకారం ముందస్తుగానే రిజర్వాయర్‌లకు సాగునీటిని అవసరాల కోసం నీటి విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నజ్మునిసాబేగం, జెడ్పీటీసీ పద్మావెంకటేశ్వర్ రెడ్డి, వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News