Monday, December 23, 2024

ప్రతి ఎకరాకు సాగునీటిని అందిస్తాం

- Advertisement -
- Advertisement -

మక్తల్ ః మక్తల్ నియోజకవర్గంలోని చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(సంగంబండ), భూత్పూరు రిజర్వాయర్ల పరిధిలోని ప్రతి ఎకరాకు సాగునీటిని అందిస్తామని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. సంగంబండ రిజర్వాయర్ నుంచి మక్తల్ పెద్ద చెరువుకు ఇటీవల నీటిని విడుదల చేశారు. పెద్ద చెరువుకు నీరు చేరడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో స్పందించిన ఆయన మంగళవారం ఉదయం కెనాల్‌ను పూర్తి స్థాయిలో పరిశీలించారు. కెనాల్‌కు అక్కడక్కడా మట్టి పేరుకుపోయి అడ్డుగా ఉండడంతో నీరు వెళ్లడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, జెసిబి సహాయంతో ఆయన మట్టిని తీయించారు. కెనాల్ ఆసాంతం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.

సిఎంఆర్‌ఎఫ్ చెక్కుల అందజేత..
నియోజకవర్గంలోని కృష్ణ మండలం కున్సి గ్రామానికి చెందిన మహదేవమ్మకు రూ.60వేలు, మరికల్ మండలం బుడ్డెగాని తండాకు చెందిన వినోద్‌కు రూ.16వేలకు సంబంధించిన సిఎంఆర్‌ఎఫ్ చెక్కులను మంగళవారం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అందించారు. ప్రభుత్వం మానవీయ కోణంతో అందిస్తున్న ఈ సహాయాన్ని మెరుగైన వైద్యం కోసం వినియోగించుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. ఆయా కార్యక్రమాల్లో బిఆర్‌ఎస్ నాయకులు గాల్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, ఈశ్వర్‌యాదవ్, శివరాజ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News