Sunday, February 23, 2025

ఉదయనిధి వ్యాఖ్యలను విశ్వసించం.. అన్ని మతాలను గౌరవిస్తాం: కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి, డిఎంకె నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ గురువారం మౌనం వీడింది. ఆయన వ్యాఖ్యలను తాము విశ్వసించబోమని అన్ని మతాలను తాము గౌరవిస్తామని కాంగ్రెస్ గురువారం ప్రకటించింది.

కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా గురువారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఏ మతాన్ని తక్కువగా భావించకుండా అన్ని మతాలను సమానంగా గౌరవించే సర్వధర్మ సమభావాన్ని కాంగ్రెస్ విశ్వసిస్తుందని ఆయన చెప్పారు. ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను తాము విశ్వసించబోమని ఆయన తెలిపారు. ఇండియా కూటమిలోని ప్రతి సభ్యుడికి అన్ని మతాలు, విశ్వాసాల పట్ల అపార గౌరవభావముందని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News