Sunday, November 17, 2024

మళ్లీ మనదే పాలన

- Advertisement -
- Advertisement -

ఎగ్జిట్ పోల్స్ తో పరేషాన్ కావొద్దు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రావడంపై బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తో పరేషాన్ కావొద్దని.. బిఆర్‌ఎస్ పార్టీ మళ్లీ విజయం సాధించబోతుందని సిఎం కెఎసిఆర్ పార్టీ నేతలకు భరోసా ఇచ్చినట్లు సమాచారం. ప్రగతిభవన్‌లో శుక్రవారం తనను కలిసి పలువురు మంత్రులు, ఎంఎల్‌ఎలతో పోలింగ్ స రళి, గెలుపు అవకాశాలపై సిఎం కెసిఆర్ చ ర్చించినట్లు తెలిసింది.

ఈ సందర్భంగా ఎగ్జిట్ పోల్స్‌ఫలితాలను కొట్టిపారేసినట్లు సమాచారం. శాసనసభ ఎన్నికల ఫలితాలపై జరుగుతు న్న ప్రచారంతో ఆందోళన చెందవద్దని.. రా ష్ట్రాన్ని పాలించబోయేది బిఆర్‌ఎస్ పార్టీయేనని చెప్పినట్లు తెలిసింది. ఆదివారం వరకు ఓపిక పట్టాలని ఆ రోజునే సంబురాలు చేసుకుందామని పార్టీ నేతలతో వ్యాఖ్యానించినట్లు సమాచారం. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసిన విషయం తెలిసిందే. ఆదివారం(డిసెంబర్ 3) ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది.

మరో వైపు తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈ నెల 4వ తేదీన జరగనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం కానున్నది. అందుకోసం తగిన ఏర్పాట్లు చేయాలని సిఎం కెసిఆర్ ఆదేశిం చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఒ) శుక్రవారం ఒక ప్రకటన జారీ చేసిం ది. ఆదివారం శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా, ఆ మరుసటి రోజే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ మూడో శాసనసభకు గురువారం(నవంబర్ 30) ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఆదివారం(డిసెంబర్ 3) ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇలాంటి సమయం లో మం త్రివర్గ సమావేశం ఏర్పాటు చేయ బోతుం డడం, అందులో తీసుకోబోయే నిర్ణయాలు ఎలాంటివి ఉంటాయోనన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మళ్లీ అధికారం తమదేనన్న విశ్వా సానికి ఈ కేబినెట్ భేటీ నిదర్శనమని బిఆర్‌ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News