Monday, December 23, 2024

చైనా నుంచి తైవాన్‌ను రక్షిస్తాం: బైడెన్

- Advertisement -
- Advertisement -

We Save Taiwan from China: Biden

చైనా నుంచి తైవాన్‌ను రక్షిస్తాం
స్పష్టం చేసిన అమెరికా నేత బైడెన్
పాలసీలో ఎటువంటి మార్పులేదు
నేరుగా సైనిక ప్రమేయంపై దాటవేత
స్వేచ్ఛ స్వాతంత్రం వారి ఇష్టం
ఇందులో జోక్యం ఉండదు
వాషింగ్టన్/బీజింగ్: చైనా ఆక్రమణ నుంచి తైవాన్‌ను తమ దేశం రక్షిస్తుందని అమెరికా అధ్యక్షులు జో బైడెన్ తెలిపారు. సిబిఎస్ న్యూస్ 60 మినిట్స్ ప్రోగ్రాంలో బైడెన్ మాట్లాడారు. స్వయం పాలిత తైవాన్‌పై ఎటువంటి దురాక్రమణకు చైనా యత్నించినా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. తైవాన్‌ను చైనా తమ భూభాగంలో భాగం అని ఎలా చెపుతుందని ప్రశ్నించారు. తైవాన్ దీవి ప్రజాస్వామ్య పరిరక్షణకు అమెరికాతరఫున అందుతోన్న మద్దతును ఆయన ఇప్పుడు మరింత అధికారికంగా వెల్లడించారు. చైనా అతిక్రమణకు పాల్పడితే అమెరికా సైనిక బలగాలు, దేశ ప్రజలంతా తైవాన్‌కు బాసటగా నిలుస్తారా? అని సిబిఎస్ ప్రతినిధి ప్రశ్నించగా దీనికి ఆయన అవునని, సందేహాలు ఏమి అవసరం లేదని తెలిపారు. తైవాన్‌కు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే దీనిని శాంతియుతంగా పరిష్కరించుకోవల్సి ఉంటుంది.

ఇదే అమెరికా విధానం అని బైడెన్ చెప్పారు. తమ పాలసీలో ఎటువంటి మార్పు లేదని, ఇకపై ఉండబోదని తేల్చిచెప్పారు. చైనా దాడి జరిగితే అక్కడికి తైవాన్‌కు అనుకూలంగా అమెరికా సేనలు వెళ్లుతాయా? అనే ప్రశ్నకు బైడెన్ సమాధానం ఇవ్వలేదు. ఏది ఏమైనా తైవాన్ స్థాయి ఉనికి అనే అంశాలు కేవలం సామరస్య ధోరణితో పరిష్కారం కావాల్సి ఉంటుందన్నారు. తైవాన్ దీవి పరిసరాలలో సముద్రంలోకి క్షిపణి ప్రయోగాలు, ఇతరత్రా సైనిక పాటవ ప్రదర్శనకు దిగుతూ చైనా తన తైవాన్ ఆధిక్యతను ప్రదర్శించుకుంటున్న దశలోనే బైడెన్ అమెరికా వైఖరిని విడమర్చి చెప్పారు. తైవాన్ భూభాగాన్ని సైనిక, భద్రతా వ్యూహపరంగా జిన్‌పింగ్ అత్యంత కీలకంగా భావిస్తూ వస్తున్నారు. తైవాన్‌లో విదేశీ ప్రమేయాన్ని సహించేది లేదంటున్నారు. తైవాన్‌కు అధికారిక స్వాతంత్య్రం కావాలని అమెరికా నేరుగా ఎటువంటి డిమాండ్‌కు దిగడం లేదని బైడెన్ తెలిపారు. అయితే తైవాన్ తమకు ఎటువంటి స్వేచ్ఛ కావాలనేది తానే నిర్ణయించుకుని తీరుతుందని వెల్లడించారు. స్వాతంత్య్రంగా ఉండాలా? ఈ దిశలో ప్రకటనకు డిమాండ్ చేయాలా? వద్దా అనేది వారి ఇష్టం . ఈ దిశలో తాము ఎటువంటి ఒత్తిడి తేవడం లేదని స్పష్టం చేశారు. దురాక్రమణను ప్రతిఘటించేందుకు తైవాన్‌కు అండగా నిలుస్తామని అన్నారు. అయితే గడిచిన మే నెలలో జపాన్‌లో బైడెన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చైనా దాడికి పాల్పడితే తైవాన్‌ను రక్షించేందుకు అమెరికా నేరుగా సైనిక చర్యకు దిగుతుందని తెలిపారు.

We Save Taiwan from China: Biden

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News