Saturday, November 23, 2024

కరోనా సమయంలో వేల ప్రాణాలను కాపాడాము

- Advertisement -
- Advertisement -

We saved thousands of lives during the corona:Chiranjeevi

 

కరోనా క్రైసిస్ సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ బ్యాంకుల్ని స్థాపించి మెగాస్టార్ చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లో సేవలందించిన సంగతి తెలిసిందే. ఈ సేవల్లో అన్ని జిల్లాల నుంచి మెగాభిమాన సంఘాల ప్రతినిధులు పాలుపంచుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ జిల్లాల నుంచి ఆక్సిజన్ సేవల్లో పాల్గొన్న ప్రతినిధుల్ని పిలిచి చిరంజీవి అభినందించారు. హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మెగాస్టా ర్ చిరంజీవి మాట్లాడుతూ- కరోనా కష్టకాలంలో నా అభిమానుల్ని కోల్పోయి చాలా ఆవేదన చెందాను. గొల్లపల్లి అనే ఒక ఊరులో చాలా మంది చనిపోయారని తెలిసి ఏం చేయాలి? అని కలత చెందాను.

అప్పు డు ఆక్సిజన్ బ్యాంకు పెడదామని ఆలోచన పుట్టింది. కరోనా పరిస్థితిలో అభిమానులు ముందుకొస్తారా? అనుకుంటే నా పిలుపు విని అభిమానులంతా అండగా నిలవడం ఎనలేని ధైర్యాన్ని ఇచ్చింది. అనుకున్నదే తడవుగా వారంలోనే ఆక్సిజన్ బ్యాంకుల్ని స్థాపించానంటే ఆ క్రెడిబిలిటీ అభిమానులదేనన్నారు. దుబాయ్.. గుజరాత్.. వైజాగ్ లాంటి చోట్ల ఇండస్ట్రియల్ ఏరియాల్లో ఆక్సిజన్‌ని తయారు చేయించాం. 3000పైగా సిలిండర్లు తయారు చేయించాం… కానీ ఆక్సిజన్ కొరతను ఎదుర్కొన్నాం. చాలా శ్రమించాం.. కరోనాలో వేల ప్రాణాలను కాపాడాము. నూటికి నూరు శాతం అభిమానులు సేవలు చేశారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు మహేష్ చింతామణి, రమణం స్వామినాయుడు, మెగా అభిమాన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

చిరంజీవి కుడి చేతికి సర్జరీ

మెగా అభిమానులతో సమావేశ కార్యక్రమంలో చిరంజీవి కుడి చేతికి బ్యాండేజ్ ఉండడం అభిమానులందరినీ కలవరపెట్టింది. ఏమైంది అని అభిమానులు చిరంజీవిని ప్రశ్నించగా ఆయన అసలు విషయం చెప్పారు. తన అరచేతికి చిన్నపాటి సర్జరీ అయిందని మెగాస్టార్ వెల్లడించారు. కుడి చేతితో ఏ పని చేయాలన్నా కొంచెం నొప్పిగా, తిమ్మిరి ఏర్పడుతున్నట్టు అనిపించడంతో డాక్టర్‌ను సంప్రదించానని చెప్పారు. అయితే కుడి చేతి మణికట్టు దగ్గరలో ఉన్న మీడియన్ నర్వ్ అనే నరం మీద ఒత్తిడి పడటం వల్ల అలా అనిపిస్తోందని దానిని కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటారని డాక్టర్లు వెల్లడించినట్లు పేర్కొన్నారు. అపోలో ఆసుపత్రిలో కాస్మొటిక్ సర్జన్ డా. సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చేతికి సర్జరీ జరిగిందని, 45 నిమిషాల పాటు జరిగిన సర్జరీలో మీడియన్ నర్వ్ చుట్టుపక్కల ఉన్న టిష్యూలను సర్జరీ ద్వారా సరి చేసి, ఒత్తిడి తగ్గించారని మెగాస్టార్ పేర్కొన్నారు. ఈ సర్జరీ కారణంగా ప్రస్తుతం జరుగుతున్న గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్‌కి 15 రోజులు గ్యాప్ ఇచ్చానని చెప్పారు. నవంబర్ ఒకటి నుంచి గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్‌లో పాల్గొంటానని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News