Monday, December 23, 2024

గాంధీజీ చూపిన బాటలో నడవాలి

- Advertisement -
- Advertisement -
  • హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

సుబేదారి: గాంధీజీ చూపిన బాటలో నడవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. బుధవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ గాంధీ చిత్రాన్ని ప్రదర్శిస్తున్న ఏషియన్ మాల్ స్క్రీన్ 1లో విద్యార్థులతో కొద్ది సేపు తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాల సందర్భగా ఈనెల 14 నుంచి 24 వరకు జిల్లాలోని 7 థియేటర్లలో జాతిపిత మహాత్మా గాంధీ చిత్రాన్ని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా ప్రదర్శించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.

తొలి రోజు 2952 మంది విద్యార్థులు వీక్షించారు. రెండో రోజు 2724 మంది విద్యార్థులు చిత్రాన్ని చూశారన్నారు. ఈనెల 15, 20 తేదీలు ప్రభుత్వ సెలవుల్లో మినహాయించి ఈనెల 24 వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు గాంధీ చిత్ర ప్రదర్శన ఉంటుందని, ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల ఉపాధ్యాయులు, యాజమాన్యాలు తమ విద్యార్థులందరూ చిత్రాన్ని వీక్షించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నారని కలెక్టర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News