ధర్మారం: మండలంలోని ఖిలావనపర్తి గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఇందులో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్, ఏఎంసీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, రైతుబంధు జిల్లా సభ్యుడు పుసుకూరి రామారావు, ఎగ్గెల స్వామి, మండల కోఆర్డినేటర్ పాకాల రాజన్న, పార్టీ అధికార ప్రతినిధి గుర్రం మోహన్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ చొప్పరి చంద్రయ్యలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గ్రామాల్లో చేసిన అభివృద్ధిని కార్యకర్తలు ప్రతి గడపకు తీసుకెళ్లి వివరించాలని కోరారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు మద్ధతు ప్రకటించేలా కార్యకర్తలు ఉద్యమ సైనికుల్లా ముందుకు సాగాలన్నారు. మళ్లీ బీఆర్‌ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేలా ప్రతి కార్యకర్త సిద్దంగా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాగంటి తార కొండయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు మోతె అంజయ్య, శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ చైర్మన్ ఠాగూర్ హనుమాన్ సింగ్, మాజీ ఎంపీటీసీ తాళ్లపెల్లి రమేష్, సీనియర్ నాయకులు మద్దునాల వెంకటేష్, కీర్తి కిరణ్, కాంపెల్లి రాజయ్య, ముత్యాల వీరస్వామి, కలవేని పెద్దలు, సామంతుల రవి, జంగిలి లక్ష్మణ్, పాలగొని రాజమల్లు, కుందేల్ల మల్లేశం, సిరిపురం కిషన్, చొప్పరి నర్సయ తొట్ల అనిల్, సిరికొండ కుమార్‌తోపాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.