Monday, December 23, 2024

విశ్వశాంతి కోసం మనం ప్రార్థన చేయాలి: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మధ్యలో వచ్చిన వాళ్లే మత మౌఢ్యం ప్రేరేపిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మండిపడ్డారు.  హరేకృష్ణ ఫౌండేషన్ అక్షయపాత్ర ద్వారా అన్నదానం చేయడం గొప్ప విషయమని మెచ్చుకున్నారు. హైదరాబాద్ లోని కోకాపేటలో నిర్మించనున్న హరే కృష్ణ హెరిటేజ్ టవర్ భూమి పూజా కార్యక్రమంలో కెసిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెసిఆర్ మీడియాతో మాట్లాడారు. ఎంతో చిత్తశుద్ధి ఉంటేనే అక్షయపాత్ర లాంటి కార్యక్రమాలు నడుస్తున్నాయని, కరోనా సమయంలో హరేకృష్ణ పౌండేషన్ ద్వారా ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. హైదరాబాద్‌లో ధనవంతులు కూడా ఐదు రూపాయల భోజనం తింటున్నారని ప్రశంసించారు. అన్ని ఆపద సమయాల్లో హరేకృష్ణ ఫౌండేషన్ ప్రజలకు అండగా నిలిచిందని కెసిఆర్ కొనియాడారు.

Also Read: కల్లోలం సృష్టించడానికే ఇక్కడకు వచ్చారా: గవర్నర్‌కు స్టాలిన్ కౌంటర్

హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. విశ్వశాంతి కోసం మనం ప్రార్థన చేయాలని పిలుపునిచ్చారు. మనశ్శాంతి కోసం ప్రస్తుతం చాలా మంది మ్యూజిక్ థెరపీ తీసుకుంటున్నారని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో హరేకృష్ణ ఆలయం నిర్మించడం మంచి పరిణామమని, హరేకృష్ణ ఆలయ నిర్మాణానికి రూ.25 కోట్లు ఇస్తామన్నారు. యాదాద్రిని అద్భుతంగా నిర్మించామని, వేములవాడ, కొండగట్టు ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని కెసిఆర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News