Monday, December 23, 2024

లోతట్టు ప్రాంతాల ప్రజలకు అండగా నిలబడాలి

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ శ్రేణులకు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు

మనతెలంగాణ/హైదరాబాద్ : భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు అండగా నిలబడాలని కాంగ్రెస్ శ్రేణులకు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి ప్రజలకు సాయం చేయాలని సూచించారు. హైదరాబాద్‌తో పాటు ఇతర ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో విస్తృతంగా పాల్గొనాలని రేవంత్ పేర్కొన్నారు. వరదల ప్రభావం తగ్గే వరకు బాధితులకు అవసరమైన నిత్యావసర సరుకులు అందించి ఇబ్బంది లేకుండా చూడాలని రేవంత్ సూచించారు. ముంపు పొంచి ఉన్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News