Tuesday, January 21, 2025

ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం

- Advertisement -
- Advertisement -
  • ఎఫ్‌డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి

జగదేవ్‌పూర్: ప్రతి కార్యకర్తకు ఉండగా ఉంటామని ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. ఆదివారం జగదేవ్‌పూర్ మండలంలోని మునిగడప గ్రామానికి చెందిన కోరమైన సంతోష్ ఇటీవల ఆనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరాడు. వైద్య ఖర్చులు ఎక్కువ మొత్తంలో అవసరం అయ్యాయి . కాగా చికిత్స కోసం అతడి కుటుంబీకులు స్ధానిక ఎంపిటిసి కిరణ్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డిని కలువగా వారి సహాకారంతో ఎఫ్‌డిసి చైర్మన్ ప్రతాప్‌రెడ్డి ని సంప్రదించగా మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకుపోగా వెంటనే స్పందించి మంత్రి బాధితునికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున 2.50 లక్షల ఎల్వోసి మంజూరు చేయించారు. మంజూరైన ఎల్‌ఓసిని ఆదివారం బాధితుడికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్‌ఎస్ ప్రతి కార్యకర్తను కాపాడుకుంటుదన్నారు. ప్రజల పక్షాన నిలిచే ప్రభుత్వం మన ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంమలో నాయకులు హరిగౌడ్, రవి, కృష్ణమూర్తి, శివలింగం, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News