Monday, January 20, 2025

కార్యకర్తలకు అండగా ఉంటాం

- Advertisement -
- Advertisement -

మక్తల్: బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వ పరంగా, పార్టీ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మక్తల్ నియోజకవర్గంలోని అమరచింత మండలం కిష్టంపల్లికి చెందిన బిఆర్‌ఎస్ కార్యకర్త రాములు ఇటీవల ప్రమాదవశాత్తు మరణించారు.

రాములు బిఆర్‌ఎస్ పార్టీ తరపున సభ్యత్వం ఉండడంతో రూ.2లక్షల ప్రమాద భీమా మంజూరైంది. దీంతో ఆదివారం రాములు కుటుంబ సభ్యులకు సంబంధిత చెక్కును ఎమ్మెల్యే చిట్టెం అందించారు. కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు రుద్రసముద్రం రామలింగం, శేఖర్‌రెడ్డి, శివారెడ్డి, నేతాజీరెడ్డి, ఈశ్వర్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News