Thursday, January 23, 2025

ఉద్యమకారుడి కుటుంబానికి అండగా నిలుస్తాం

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుడు కృష్ణారెడ్డి కుటుంబానికి అండగా నిలుస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని బొప్పారం గ్రామంలో కృష్ణారెడ్డి దశదిన కార్యక్రమంలో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమంలో, బంగారు తెలంగాణ నిర్మాణంలో కృష్ణారెడ్డి అందించిన సేవలు మరువలేనివన్నారు. కుటుంబ సభ్యులకు బీఆర్‌ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆయన వెంట జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, ఎంపీపీ మర్ల స్వర్ణలతచంద్రారెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు తుడి నరసింహారావు, ప్రధాన కార్యదర్శి బత్తుల ప్రసాద్, బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు మద్ది శ్రీనివాస్ గౌడ్, పగడాల ఉపేందర్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News