Wednesday, January 22, 2025

మధ్యాహ్న భోజన కార్మికులకు అండగా ఉంటాం

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి రూరల్: మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. జీవో నెంబర్ 8 అమలు చేస్తూ రూ.2 వేలను రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని, అలాగే ప్రభుత్వ పాఠశాలలకు కావాల్సిన నిత్యావసర వస్తువులు, వంట గ్యాస్,వంట పాత్రలు, ఉప్పు, పప్పు, నూనె తదితర అన్ని వస్తువులు, కోడిగుడ్లు టెండరింగ్ దశలో ఉన్నాయని తెలిపారు. కొద్ది రోజుల్లో వాటిని కూడా అమలు పరుస్తామని ప్రభుత్వం తెలిపినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదేశాలతో పాటు ఎమ్మెల్యే అమరవీరుల స్థూపం వద్ద నిర్వహిస్తున్న కార్మికులకు చెంతకు వచ్చి కోడిగుడ్ల సమస్య పరిష్కారం కూడా త్వరలోనే తీరనుందని హామీ ఇవ్వడంతో తాము నిర్వహిస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు మధ్యాహ్న భోజన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పూసాల రమేష్ తెలిపారు. తాము బుధవారం నుండి విధుల్లో పాల్గొంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మధ్యాహ్న భోజన వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News