Friday, January 10, 2025

ప్రతి కార్యకర్త కుటుంబాన్ని ఆదుకుంటాం

- Advertisement -
- Advertisement -
  • బిఆర్‌ఎస్ సభ్యత్వం కలిగిన వారికి బీమాను అందజేస్తాం
  • ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి

దౌల్తాబాద్: ప్రతి కార్యకర్త కుటుంబాన్ని ఆదుకుంటామని ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. గత పది నెలల క్రితం ఆంధ్రజ్యోతి రిపోర్టర్ కొలుపుల శ్రీనివాస్ మృతి చెందడంతో బిఆర్‌ఎస్ సభ్యత్వ బీమా పథకం ద్వారా రెండు లక్షల రూపాయలను చెక్కును ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా తన సతీమణి మహేశ్వరికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దౌల్తాబాద్ సీనియర్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ దోమ్మాట గ్రామానికి చెందిన కొలుపుల శ్రీనివాస్ మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. తాను బిఆర్‌ఎస్‌కి తన వంతు సహాయంగా పని చేసి పార్టీని ముందుకు నడిపించుతూ జర్నలిస్టుగా కొనసాగుతూ ప్రజలకు చేదోడువాదోడుగా నిలబడ్డారని తెలిపారు.

ఆ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉండి భరోసా కల్పిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ అధ్యక్షురాలు పూజిత వెంకట్ రెడ్డి, ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు బండారు దేవేందర్, దండోరా శివరాజ్, తుమ్మ శ్రీనివాస్, యాదగిరితో పాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News