Sunday, December 22, 2024

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు అండగా ఉంటాం : ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

- Advertisement -
- Advertisement -

We support Minister Srinivas Goud: MLA Lakshmareddy

మహబూబ్​నగర్​: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌పై హత్యకు కుట్రపన్నడం దారుణమని, ఇలాంటి ఘటనలు జిల్లాలో జరగడం దురదృష్టకరమని జిల్లా టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, జడ్చర్చ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి గాని ఇలాంటి కుట్ర పన్నడం దుర్మార్గం అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి మీద నిందలు వేశారు. కిడ్నాప్‌లు అంటూ తప్పుడు ప్రచారం చేశారు. బీజేపీ నాయకులుఇప్పుడు ఏం సమాధానం చెప్తారన్నారు. పార్టీలకతీతంగా అందరూ ఇలాంటి ఘటనలు ఖండించాలన్నారు. మంత్రికి అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..ఉద్యమ నాయకుడు, ప్రభుత్వంలో క్రియాశీల నాయకుడిగా ఉన్న శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యకు కుట్ర చేయడం దారుణమన్నారు. తెలంగాణ పోలీసులు తొందరగా స్పదించడం తోనే ఇంత పెద్ద కుట్ర బయటపడిందన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఎవరిని వదిలిపెట్టమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News